రంగారెడ్డి

గద్దలా..పెద్దలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 20: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యం రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొందుర్గు మండలం రాంచంద్రాపూర్ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. పౌర సరఫరాలశాఖ అధికారుల్లో స్పందన కనిపించడం లేదు. పేదల బియ్యం కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకపోతున్నా అధికారులు ఎందుకు కిమ్మనకుండా వుంటున్నారో అన్నది అర్ధం కాని ప్రశ్న. రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాలోని ఒక ఫౌల్ట్ఫ్రీమ్‌కు అక్రమంగా 33 బస్తాల బియ్యం జీపులో రవాణా చేస్తుండగా రాంచంద్రాపూర్ గ్రామశివారులో కొందుర్గు పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో తనిఖీ చేయగా ప్రభుత్వ సబ్సిడీ బియ్యం పట్టుబడింది. రేషన్‌కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమంగా వికారాబాద్ జిల్లాకు తరలిస్తున్నారని నిర్ధారణకు వచ్చిన తరువాతే జీపుతో పాటు 33బస్తాల బియ్యాన్ని స్వాధీన పరుచుకొని పౌర సరఫరాల శాఖ అధికారులకు కేసు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. షాద్‌నగర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలియకుండా అక్రమ రవాణా జరుగుతుందా.. ఇక్కడి నుంచి అక్రమంగా సబ్సిడీ బియ్యం ఇతర జిల్లాలకు రవాణా జరుగుతున్నట్లు షాద్‌నగర్ రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఈ బియ్యం ఎక్కడి నుండి అక్రమ రవాణా జరుగుతుంది.. అనే విషయాలను విచారణ చేయకుండా అధికారులు వౌనం వహిస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన బియ్యాన్ని వినియోగదారులు విక్రయించి ఉంటారని, అక్రమంగా రవాణా చేస్తున్న 33బస్తాల బియ్యం తూకం వేయగా 10క్వింటాల 40కిలోలు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన డీలర్లపై విచారణ జరపకుండా కేసును మూసివేసినట్లు ప్రచారంలో ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి రేషన్ బియ్యం ఇతర జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతుందని ఆరోపణలు ఉన్నప్పటికి స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారుల్లో స్పందన కనిపించడం లేదు. ప్రతి నెల ఎన్ని బస్తాల బియ్యం రేషన్ డీలర్లకు పంపిణీ చేశాం.. నెల చివరి వారం వరకు ఎన్ని బస్తాల బియ్యం వినియోగదారులకు డీలర్లు పంపిణీ చేశారు.. మిగిలిన బియ్యం వచ్చే నెలలో స్టాక్ చూయించారా.. లేదో అనే విషయాలను అధికారులు స్పష్టంగా రికార్డుల్లో చూపించడం లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని వినియోగదారులకు రేషన్ కార్డుల ద్వారా సక్రమంగా సరైన సమయంలో పంపిణీ చేయుటకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.