రంగారెడ్డి

ఆస్తిపన్ను బకాయిదారుల ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 23: ఆస్తిపన్నులు చెల్లించని మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేయనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో 2017-18 ఆర్ధిక సంవత్సరం ఇంటిపన్నులు ఇతర పన్నుల వసూళ్ల విషయమై బిల్ కలెక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ రామిరెడ్డి మాట్లాడుతూ ఆస్తిపన్ను డిమాండ్ రూ. 421 లక్షలు ఉండగా, ఇప్పటి వరకు రూ. 206లక్షలతో 54.89 శాతం వసూలు చేశామని, 45.11 శాతం అంటే రూ.189.00 లక్షలు వసూలు చేయాల్సి ఉందని వివరించారు. రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి లక్ష్యాలను నిర్దేశించి మార్చి చివరి కల్లా వంద శాతం ఆస్తిపన్ను వసూలు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కమిషనర్ రామిరెడ్డి ఆదేశించారు. గృహ యాజమానులను సకాలంలో ఇంటిపన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసి చట్టప్రకారం చరాస్థులను జప్తు చేయుటకు సిబ్బందికి కఠినమైర ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేశారు.
వికారాబాద్: ఆస్తి పన్ను బకాయ, ట్రేడ్ లైసెన్స్ బకాయ చెల్లించనందున జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కూడలి, బీజేఆర్ కూడలిలోని దుకాణాల సముదాయాలను మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ బీ.ఏసుదాసు, జవాన్లు వినోద్, చిన్నయ్య శుక్రవారం సీజ్ చేశారు. కమిషనర్ బీ.సత్యనారాయణ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో ఆస్తిపన్ను బకాయలు, నల్లా బకాయలు, ట్రేడ్ లైసెన్స్ బకాయలు సకాలంలో చెల్లించి సహకరించాలని, లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలి
జీడిమెట్ల, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. షాపూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు.
రాజేంద్రనగర్: కాంగ్రెస్ చేపట్టనున్న రాష్టవ్య్రాప్త బస్సుయాత్రను నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాదూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అరాంఘర్ చౌరస్తాలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటడమే తప్ప, పనులు మాత్రం అడుగు జరగడం లేదన్నారు. ఈనెల 26న చేపట్టే బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి సుమారు 20 వేల మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్తున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ.ప్రవీణ్, ఐఎన్‌టీయూసీసి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎన్.అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
చేవెళ్ల: చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించే ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గం ఇన్‌చార్జి వెంకటస్వామి కోరారు. శుక్రవారం చేవెళ్ల అరుణ గార్డెన్‌లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి 15వేల మంది తరలిరావాలని, నాలుగు వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి మొత్తం 30వేలకుపైగా ప్రజలు వస్తారని వివరించారు. మాజీ మంత్రి సబితా రెడ్డి నేతృత్వంలో సభను విజయవంతం చేస్తామని చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు రమణా రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్‌లు కృష్ణారెడ్డి, బల్వంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటేశం గుప్త, జిల్లా పార్టీ కార్యదర్శిలు గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మాధవ గౌడ్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, ఏ-బ్లాక్ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ ఉన్నారు.