రంగారెడ్డి

నేరాల అదుపునకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 23: నేరాల శాతాన్ని తగ్గించి, వికారాబాద్ జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు మద్యం దుకాణాల యజమానులు సహకరించాలని ఎస్పీ టీ.అన్నపూర్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని మద్యం దుకాణాల యజమానులతో సీసీ కెమెరాలపై నేనుసైతం కార్యక్రమంలో భా గంగా అవగాహన ఏర్పాటు చేశారు. మనుషులు చెప్పే సాక్ష్యాల కంటే, సాంకేతిక పరిజ్ఞానంతో లభించే సా క్ష్యాలకు కోర్టులో ఎక్కువ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. మద్యం దుకా ణం వద్ద దుకాణానికే కాకుండా ప్రజలకు, పోలీసులకు ఉపయోగపడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన కెమెరాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్‌కు లింక్ చేస్తామని వివరించారు. ఇటీవలే వికారాబాద్ పోలిస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసు అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారని గుర్తుచేశారు. హెచ్‌డీ నాణ్యత కలిగిన సీసీ కెమరాలనే ఏర్పాటు చేసుకోవాలని, మామూలు వాటిని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల కంపెనీ నిర్వాహకుల వద్ద వ్యాపారులు నేరుగా కొనాలని అన్నారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే.వరప్రసాద్, డీఎస్‌పీ శిరీష పాల్గొన్నారు.
యువత పాలుపంచుకోవాలి
జిల్లాలోని యువత ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగస్వాములు కావాలని వికారాబాద్ ఎస్పీ టీ.అన్నపూర్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గౌలీకర్ ఫంక్షన్ హాలులో జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు 500 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, నిరుద్యోగ యువత జాబ్‌మేళాలకు హాజరై అర్హతకు తగిన ఉద్యోగం పొందాలని సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో విలేజ్ పోలీస్ ఆఫీసర్, ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలిసింగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీసీ కెమరాల ఉపయోగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు. గతంలో జాబ్‌మేళా నిర్వహిం చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశం కల్పించామని, భవిష్యత్‌లోనూ నిర్వహిస్తామని తెలిపారు. జాబ్‌మేళాలో నవత ట్రాన్స్‌పోర్ట్ 80 మంది, సెక్యూరిటీ గార్డ్స్ 50, అపోలో ఫార్మసీ 82, కాల్ సెంటర్ నిర్వాహకులు 79, మెడికల్ ఎమర్జెన్సీ 21 మందితో కలిపి మొత్తం 312 మందిని ఎంపిక చేసుకున్నారు. నిరుద్యోగులను ఎంపిక చేసిన కంపెనీలకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీ శిరీష, వికారాబాద్, ధారూర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎం.వెంకటరామయ్య, జే.ఉపేందర్, శ్రీనివాసు లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎంబీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
శంషాబాద్, ఫిబ్రవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కిషన్‌గూడ గ్రామం వద్ద రంగారెడ్డి జిల్లా ఎంబీసీ కులాల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూర్యారావు మాట్లాడుతూ గత సంవత్సరం ఎంబీసీ కులాలను గుర్తించి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. దీనికి వేయి కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా కేటాయంచకపోవడంతో ఎంబీసీ కులా లు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిశంకర్, స త్యం, రాష్ట్ర ఇన్‌చార్జి నర్సింహ సాగర్, యాదయ్య, జగన్, జిల్లా కన్వీనర్ సత్యనారాయణ, మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్ పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 23: ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ విల్లాల నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్‌కు మక్త గ్రామానికి చెందిన బైరు పాండుగౌడ్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబ ర్లు 754, 755 లోని 4.31 ఎకరాల భూమిపై శ్రీ హర్ష నిర్మాణ సంస్థ, వెంచురా హౌసింగ్ సంస్థలు ప్రాజెక్టు ఋణం కింద రూ.15 కోట్లు తీసుకుని డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీకి మార్టిగేజ్ చేశారని తెలిపారు. తాకట్టు పెట్టిన భూమికి సంబంధించి ఋణం తీర్చకుండా మూడు బ్లాకులుగా చేసి అపార్టుమెంట్ల నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేయటంతో పాటు 40 అడుగుల రోడ్డును తగ్గించినట్లు గుర్తించిన అధికారులు గతంలో పనులు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థలకు తెలియజేయకుండా అదే భూమిలో విల్లాలు నిర్మాణం చేయడానికి దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. వ్యవసాయ భూమికి నాలా బదలాయింపు అనుమతులు కూడా లేవని, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తూ నిర్మిస్తున్న విల్లాలు కొనుగోలు చేసే వారికి నష్టం కలిగే విధంగా నిర్మాణ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బైరు పాండుగౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.