రంగారెడ్డి

ఏసీబీ దాడులతో అధికారుల్లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 23: ఏసీబీ అధికారుల దాడులతో స్థానిక అధికారుల్లో కలకలం మొదలైంది. గురువారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణ సమీపంలోని ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి, డ్రైవర్ బాలయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన నేపధ్యంతో మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులకు చెమటలు పడుతున్నాయి. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనంటూ అధికారులు భయం గుప్పిట్లో పనులు చేస్తున్నారు. ఫరూఖ్‌నగర్ రెవెన్యూ కార్యాలయం, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటాయి. ఈ కార్యాలయాలతోపాటు మిగతా ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. షాద్‌నగర్ ప్రాంతం రియల్ ఏస్టేట్ పరంగా రోజురోజుకు అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందనే విషయం బహిరంగంగానే వినిపిస్తుంది. ఏ చిన్న పని కావాలన్నా పనిని బట్టి ముడుపులు చెల్లించక తప్పడం లేదనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. పలు కార్యాలయాల్లో ఎలాంటి పనులు చేసుకోవాలన్నా ముందుగానే అమ్యామ్యాలు చెల్లించాల్సి వస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. పేద, ధనిక, మధ్య తరగతి ప్రజలు అనే తారతమ్యం లేకుండా ఆయా కార్యాలయాల్లో పనులు కావాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనంటున్నారు అవినీతి అధికారులు. లేదంటే తమ పనుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిరుగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ కార్యాలయంలో ఏ చిన్నపనికోసం వెళ్లినా అధికారులకు డబ్బులు ముట్టజెప్పందే ఫైళ్లను ముందుకు పంపించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు సకాలంలో సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికి అధికారులు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను నిలువుదోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న సిబ్బంది పనికో రేటును నిర్ణయించి తమ వసూళ్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వసూలు చేసిన డబ్బుల్లో పైస్థాయి అధికారులకు వాటా ఇచ్చి తమ పనిని సులువుగా చేసుకుంటున్నారు. కిందిస్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు చెల్లించాల్సిందే..అప్పుడే అనుకున్న పనులు సజావుగా జరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. లేదంటే నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏ సమయంలో.. ఏప్పుడైనా ఆయా ప్రభుత్వ శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.