రంగారెడ్డి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిఎల్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బహుజన లెప్ట్‌ఫ్రంట్ ఎదుగుతుందని బిఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 119స్థానాల్లో బిఎల్‌ఎఫ్ పోటీ చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీల పాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, త్వరలోనే బహుజన లెప్ట్‌ఫ్రంట్ రాజకీయ శక్తిగా అవతరించనుందని అన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారందరికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి స్వార్ధ ప్రయోజనాల కోసం నేతలు కుంభకోణాల్లో మునిగిపోతున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేడు ఏ రైతును పూర్తిస్థాయిలో ఆదుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల వంటి ప్రాంతాలపై చూపించిన శ్రద్ధ మిగతా జిల్లాలపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఎంపిగా ఎన్నికై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తరువాత ఇటువైపు కనె్నత్తి చూడకపోవడం దారుణమని అన్నారు.
బహుజన లెప్ట్‌ఫ్రంట్ ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారించి రాజకీయ శక్తిగా ఎదగనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, ఎన్.రాజు, బర్క కృష్ణయాదవ్, మన్నారం నాగరాజు, మల్లేష్, ఈశ్వర్, ప్రశాంత్, సంతోష్‌కుమార్, నరేందర్ పాల్గొన్నారు.