క్రీడాభూమి

రౌత్‌కు రియో బెర్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 12: దక్షిణాసియా క్రీడల్లో భారత్ బంగారు పతకాల పంట కొనసాగుతోంది. శుక్రవారం ఏడో రోజు కూడా అథ్లెటిక్స్, షూటింగ్‌విభాగాల్లో మన దేశానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాక ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కవితా రౌత్ మహిళల మారథాన్ రేస్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడమే కాక రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం నేటి పోటీల్లో విశేషం. అయితే హాకీ ఫైనల్లో దాయాది పాకిస్తాన్ చేతిలో 0-1 తేడాతో ఓటమి పాలయి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శుక్రవారం పోటీలు ముగిసే సరికి భారత్ పతకాల సంఖ్య 248కి చేరుకోగా, అందులో బంగారు పతకాలే 146 ఉన్నాయి. మరో 70 రజత, 23 కాంస్య పతకాలు కూడా ఇందులో ఉన్నాయి. 157 పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలిచినప్పటికీ దానికి లభించిన బంగారు పతకాలు 25మాత్రమే కావడం గమనార్హం. కాగా, 73 పతకాలతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది.
శుక్రవారం అథ్లెటిక్ పోటీలకు చివరి రోజు కాగా, కవిత మహిళల మారథాన్‌లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఈ రోజును మరపురానిదిగా చేసింది. నాసిక్‌కు చెందిన 30 ఏళ్ల రౌత్ 2 గంటల 38 నిమిషాల 38 సెకన్లలో రేస్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా రియో ఒలింపిక్స్‌కు సైతం క్వాలిఫై అయింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్‌కు మన దేశంనుంచి ఇప్పటికే ఒపి జైషా, లలితా బబ్బర్, సుధాసింగ్‌లు అర్హత పొందిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాసియా క్రీడల నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి అథ్లెట్ రౌత్ కావడం గమనార్హం.
కాగా, పురుషుల మారథాన్‌లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మరో అథ్లెట్ నితేందర్ సింగ్ రావత్ 2 గంటల 15 నిమిషాల 18 సెకన్లలో రేస్ పూర్తి చేసి బంగారు పతకం సాధించాడు. అయితే రెండో స్థానంలో వచ్చిన శ్రీలంకకు చెందిన ఇంద్రజిత్ కూరేకు రావత్‌కు మధ్య తేడా ఒక్క సెకనే కావడం గమనార్హం. మన దేశానికే చెందిన ఖేతా రామ్‌కు కాంస్యపతకం దక్కింది. ఈ రోజు లభించిన రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలుపుకొని భారత్ అథ్లెటిక్స్ పోటీల్లో మొత్తం 28 స్వర్ణాలు, 22 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించినట్లయింది.
షూటింగ్‌లో సైతం దాదాపు ఇదే కథ పునరావృతమైంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన చైన్ సింగ్ పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి వ్యక్తిగతంగా రెండో బంగారు పతకాన్ని సాధించాడు. నిజానికి ఈ రోజు షూటింగ్‌లో ళనించిన నాలుగు బంగారు పతకాలూ భారత్‌కే లభించాయి. కాగా, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్‌ను మించిన ప్రతిభను చైన్ సింగ్ కనబరిచాడు. నారంగ్ కేవలం కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అనంతరం టీమ్ ఈవెంట్‌లో చైన్, నారంగ్, ఇమ్రాన్‌ఖాన్‌లు మొత్తం 1863.4 పాయింట్లతో బంగారు పతకం దక్కించుకున్నారు. కాగా, పురుషుల వ్యక్తిగత 20 మీ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో మొత్తం మూడు పతకాలూ భారత్‌కే దక్కాయి. నీరజ్ కుమార్ స్వర్ణ పతకం దక్కించుకోగా, గురుప్రీత్ సింగ్, మహేందర్ సింగ్‌లు రజత, కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ కలిసి టీమ్ ఈవెంట్‌లోను స్వర్ణ పతకం సాధించారు.
పాక్ చేతిలో ఓడిన హాకీ జట్టు
కాగా, శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో 0-1గోల్స్ తేడాతో ఓటమి పాలయి రజత పతకానికే పరిమితమైంది. మొదటి అర్ధ్భాగం అదనపు సమయంలో అవైసుర్ రెహమాన్ చేసిన గోల్‌తో పాక్ విజయం సాధించింది.