రంగారెడ్డి

నాగోలు డివిజన్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 13: స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల అవగాహన లోపంతో నాగోలు డివిజన్‌లో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం డివిజన్ పరిధిలోని మల్లికార్జున్‌నగర్, అయ్యప్పనగర్, త్యాగరాయ నగర్, ఆనంద్‌నగర్, ఇంద్రప్రస్థకాలనీ, ఫతుల్లాగూడ కాలనీలలో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. రంగారెడ్డి మాట్లాడుతూ... తాను రెండు నెలలుగా చేపట్టిన పాదయాత్రలో అన్ని ప్రాంతాలకంటే అధిక సమస్యలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. కార్పొరేటర్లు గెలుపొంది రెండేళ్లు కావస్తున్న సొంత నిధులు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని, ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో ఆర్భాటాలు, సోకులు చేస్తున్నారని రంగారెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతల సురేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి, బద్దం మహేందర్ గౌడ్, తూర్పాటి కృష్ణ, చెక్క అశోక్, నాంపల్లి రామేశ్వర్, ఏర్పుల యాదయ్య, యంజాల జగన్, సొమ్మ రాములు, గోవింద్ వెంకట్, శ్రీకాంత్ పాల్గొన్నారు.