రంగారెడ్డి

పదోతరగతి పరీక్షలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 24: జిల్లాలో పదోతరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. శనివారం పరిగి పట్టణ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న పది పరీక్ష కేంద్రాలను సందర్శించి వివిధ సదుపాయాలపై సం బంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు మాల్‌ప్రాక్టీ స జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్విజిలేటర్లకు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో సిట్టింగ్ స్క్వాడ్ విధులు సక్రమంగా నిర్వహించి ఎప్పటికపుడు తనిఖీ చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ ఆబేద్‌అలీ ఉన్నారు.

వికారాబాద్/పరిగి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు వీలుగా అధికారులు కృషిచేయాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. శనివారం పరిగి మండలంలోని జాఫర్‌పల్లిలోని వాటర్‌గ్రిడ్ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. క లెక్టర్ అసంపూర్తిగా ఉన్న కొన్ని పైపులైన్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను సూచించారు. వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లోని 1050 గ్రామాలకు ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేందుకు వీలుగా పనులను చేపడుతున్నట్లు చెప్పారు. రాఘవపూర్‌లోని 135 ఎం ఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు ఎల్లూరి నుంచి నీరు వస్తుందని, ఆ నీటిని శుద్ధి చేసి తాగునీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 600 ఓహెచ్‌బీఆర్ రిజర్వాయర్ పనులు సైతం పూర్తికావచ్చాయని, ప్లాంట్‌కు వచ్చే వాటర్ నిల్వ ట్యాంకు పనులు సైతం పూర్తికావచ్చాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ ఇంజనీర్లు పద్మలత, నరేందర్, శ్రీనివాస్, పరిగి తహశీల్దార్ ఆబేద్ అలీ ఉన్నారు.

వికారాబాద్: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేల్ట్రన్) సంస్థల సం యుక్త ఆధ్వర్యంలో జిల్లా నిరుద్యోగ యువతి, యువకులకు ప్రాంతీయ బేధం లేకుండా 45 రోజుల ఉచిత శిక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కే.బాబుమోజస్ తెలిపారు. శిక్షణలో భాగంగా కేల్ట్రన్ ఏడు ప్రముఖ రంగాలలో శిక్షణ, ఉద్యోగావకాశాలు ఇస్తున్నట్లు, శిక్షణకాలంలో ఉచిత భోజనంతో పాటు కావాల్సిన వారికి ఉచిత వసతి సైతం 45 రోజులపాటు కల్పిస్తామని చెప్పారు. శిక్షణకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఎస్సీ యువతి, యువకులు, విద్యా అర్హతలు పదో తరగతి పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఇతర డిగ్రీ పాస్/ఫెయిల్ అయినవారు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉచిత కోర్సులు వ్యక్తిత్వ వికాసం, ఇంగ్లీషు భాష, ప్రావీణ్య సంభాషణలు మొదలైన విభాగాలలో ఉంటుందని అ న్నారు.
ఆసక్తిగల వారు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని 34 నెంబరు గది లో పేర్లు నమోదు చేసుకుని పత్రాలు సమర్పించాలని కోరారు. 28న కలెక్టర్ సయ్యద్ ఉమర్‌జలీల్ చేతుల మీదు గా శిక్షణ తరగతులు ప్రారంభించబడతాయని చెప్పారు. కోర్సు వివరాలో కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్ మెయింటెనెన్స్, అకౌంటింగ్ కానె్సప్ట్, ట్యాలీ, షోరూం రిటైల్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, బేసిక్ ఆఫీస్ ఆటోమేషన్, హౌస్‌కీపింగ్ అని పేర్కొన్నారు. నమోదుకు ఆధార్‌కార్డు, నాలుగు ఫొటోలు, 2018 ఆదాయ ధ్రువీకరణపత్రము, కుల ధ్రువీకరణపత్రము, ఇతర విద్యార్హతల ధ్రువీకరణపత్రాలుండాలన్నారు. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్లు 9866682579, 9492672784 అని వివరించారు.