రంగారెడ్డి

తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సంఘటితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాలను సంఘటిత పరిచి, నమోదు చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ల రాంచంద్రా రావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిరం పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య జిల్లా స్థాయి సమావేశానికి తడకమళ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 13 నెలల పాటు నాటకాలను ప్రర్శించడం సంతోషకరమని తెలిపారు. ప్రదర్శనలకు ఆర్థికంగా ఆదుకున్న డాక్టర్ సత్యనారాయణ గౌడ్, చేదోడు వాదోడుగా నిలిచిన వారిని అభినందించారు. కళాభిమానులు, పోషకులు ఉన్నందునే నాటకాలు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ నాటకాలను ఆంధ్ర పెత్తందార్లు అణగదొక్కారని, తెలంగాణ కళాకారులు లేరనే భావనను కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భాష, సంస్కృతి పక్షాన కేవీ రమణాచారి సమక్షంలో తెలుగు విశ్వవిద్యాలయంలో సెమినార్ ఏర్పాటు చేసి 350 మంది అచ్చ తెలంగాణ కళాకారులు, పెద్ద పెద్ద మేధావులతో ఉపన్యాసాలు ఇప్పించామని గుర్తు చేశారు. సెమినార్‌తో తెలంగాణలో కళాకారులకు కొదవ లేదని సీఎం కేసీఆర్ గ్రహించారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎం రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీ.దుర్వాస రాజు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా నాటక సమాజాల కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్
వికారాబాద్ జిల్లానాటక సమాజాల కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎం.అంజిలయ్య గౌడ్, కోశాధికారిగా కదనగల్ అంజిలయ్య, కార్య నిర్వాహక కార్యదర్శిగా బీ.వెంకటేశం (పరిగి), ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్ (లక్ష్మిదేవిపల్లి), బీ.నర్సయ్య (నస్కల్), జగన్ (రాఘవపూర్), సంయుక్త కార్యదర్శులుగా జీ.నారాయణ (లక్ష్మిదేవిపల్లి), మల్లయ్య (మిట్టకోడూర్), రాఘవేంద్రచారి (పూడూర్), కార్యవర్గ సభ్యులుగా పాండురంగా చారి (నారాయణపూర్), ఎన్.వెంకటయ్య (రూప్‌ఖాన్‌పేట్), నర్సిములు (దోమ), శివకుమార్ (తాండూరు), అంజిలయ్య (రేగడిమైలారం), నర్సిములు (వికారాబాద్), గౌరవ సలహాదారులుగా వరకవుల జగన్నాథ రావు, హుండెకారి సత్యనారాయణ, కృష్ణగౌడ్ (వికారాబాద్), వీరకాంతం (వికారాబాద్) ఎన్నికయ్యారు.

మండుతున్న ఎండలు..
ఎండుతున్న గొంతులు
* అడుగంటుతున్న భూగర్భ జలాలు * దాహార్తితో అలమటిస్తున్న ప్రజలు
* ఇక ట్యాంకర్లపైనే ఆధారమా?
ఉప్పల్, ఏప్రిల్ 22: ఎండలు రోజు రోజుకు ముదురుతుండటంతో గొంతులు ఎండుతున్నాయి. వారం రోజులుగా ఎండలు తీవ్రమవుతుండటంతో జంట పురపాలక సంఘాలైన పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో దాహర్తితో అలమటించాల్సి వస్తోందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లాల ద్వారా అస్తవ్యస్తమైన నీటి సరఫరాతో అవస్థలు పడుతున్న ప్రజలు ఇక ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ప్రాంతాలను జల మండలి నీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో పైపులైన్లు, వాటర్ సంప్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఉప్పల్‌కు ఆనుకుని ఉన్న బోడుప్పల్‌లో 15, పీర్జాదిగూడలో ఐదు కాలనీలలో మాత్రమే నీటి సరఫరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోని కాలనీలలో పురపాలక సంఘాల అధికారులే నీటిని సరఫరా చేస్తున్నారు. బిల్లు వసూలుతో పాటు కనెక్షన్లు, నీటి సరఫరా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ దినం విడిచి దినం నీటిని సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బోడుప్పల్, చెంగిచర్ల, మేడిపల్లి, పర్వతాపూర్, పీర్జాదిగూడలోని కాలనీలలో పురపాలక సంఘాల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కాలనీలలో మూడు, నాలుగు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రమవుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి సమస్య మరింత తీవ్రమైందని పలువురు వాపోతున్నారు. వచ్చే అర్ధగంట నీటి సరఫరాలో లోఫ్రెషర్‌తో నీరు సరిపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పీర్జాదిగూడలోని కెనరానగర్, అన్నపూర్ణకాలనీ, శంకర్‌నగర్, బుద్ధానగర్, మల్లిఖార్జున్‌నగర్, మేడిపల్లి మారుతీనగర్, సాయినగర్, విహారిక కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, కమలానగర్, సాయి మహదేవ్‌నగర్, ఆర్టీసీ కాలనీ, తదితర ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లలో నీళ్లు తగ్గకపోవడంతో ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి స్వాధీనం చేసుకున్న కాలనీలలో అయితే దినం విడిచి దినం నీటిని సరఫరా చేస్తున్నారని, మిగతా కాలనీలను త్వరగా స్వాధీనం చేసుకుని ఇదే తరహాలో నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ట్యాంకర్లకు డిమాండ్
భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో నీటి సమస్య నెలకొంది. దీంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. వేసవి కాలం వచ్చిందంటే ట్యాంకర్ల డ్రైవర్లకు పండుగే. గతంలో 350 లేక 400 చెల్లిస్తే ప్రస్తుతం అవసరాన్ని బట్టి 600 ధర పలుకుతుంది. ప్రస్తుతం అవసరాన్ని బట్టి ఎన్ని డబ్బులు అయినా సరే ట్యాంకర్ నీళ్ల కోసం చెల్లించుకోక తప్పదు. ప్రతి ఇంట్లో, లేక ఆఫీసులలో నీళ్లు లేకుంటే ఏమీ చేయలేము. దీంతో ఎన్ని డబ్బులు అయినా సరే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. అడిగినంత ఇచ్చినా ఎంత సమయం అయినా వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. ప్రజల డిమాండ్‌ను బట్టి ట్యాంకర్ల డ్రైవర్లు స్వచ్చమైన నీటిని కాకుండా చెరువు, కుంటల్లోని కలుషితమైన నీటిని సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి నీరు అయినా కొనుగోలు చేయకతప్పడం లేదు.