రంగారెడ్డి

సమస్యల పరిష్కారంలో శ్రద్ధ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఏప్రిల్ 25: జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, మండల పరిధిలో కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రంరెడ్డి నిలదీశారు. బుధవారం సరూర్‌నగర్ 16వ సర్వసభ్య సమావేశం ఎంపీపీ తీగల విక్రంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీలు చల్వాది రాజేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, బాలాపూర్ చౌరస్తాలో బార్‌కు ఎదురుగా ఓ కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంఈఓను ప్రశ్నించారు. విద్యా అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు నేడు దొడ్లుగా మారాయని వైస్ ఎంపీపీ ఓమర్ బామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యా అధికారులు ప్రభుత్వ పాఠశాలలపై తగిన శ్రద్ధ తీసుకోవాలని ఎంపీపీ విక్రంరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, ప్రవేట్ పాఠశాలల నిర్వాహకులతో కలిపి త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు. బాలాపూర్, సరూర్‌నగర్ మండల పరిధిలో అనుమతులు ఉన్న, లేని పాఠశాలల లిస్టును ప్రకటిస్తామని అన్నారు. దీంతో ప్రజలకు అనుమతులు లేని పాఠశాలల వివరాలు తెలుస్తాయని ఎంఈఓ పేర్కొన్నారు. ఎంపీటీసీ అఫ్జల్ మాట్లాడుతూ.. జల్‌పల్లి మున్సిపాలిటీలో మంచినీరు రాకున్న, వీధి లైట్లు వెలగకున్నా, రోడ్లు సరిగా లేకున్నా, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
జల్‌పల్లి మున్సిపాలిటీలో కనీస వౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ వస్తున్నందున్న అధికారులు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మసీదులకు లైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ అఫ్జల్ కోరారు. మీర్‌పేట్, జిల్లెలగూడ పరిధిలోని చెరువుల్లో గుర్రపుడెక్కతో, దోమల బెడద అధికమైందని ఎంపీటిసీ లలిత జగన్ అన్నారు.
అక్రమ వెంచర్లపై ఫిర్యాదు
జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఏమి చేస్తున్నారని జడ్పీటీసీ జిల్లెల నరేందర్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ వెంచర్ల మూలంగా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రావడం లేదన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 18 వరకు అక్రమ వెంచర్లు వేసినట్లు స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.జల్‌పల్లి కమిషనర్‌కు అక్రమ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని పరిశ్రమలపై ఉన్న శ్రద్ధ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని మండిపడ్డారు. జల్‌పల్లి అక్రమ వెంచర్లపై కఠిన చర్యలతోపాటు ఎంపీటీసీలు లేవనెత్తిన స్థానిక సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని ఎంపీపీ తీగల విక్రంరెడ్డి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీవీ ప్రశాంతి, ఎంపీటీసీ పెండ్యాల నర్సింహ పాల్గొన్నారు.

భూముల లీజ్ నిబంధనల ఉల్లంఘనపై
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు షోకాజ్
ఉప్పల్, ఏప్రిల్ 25: ఉప్పల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 23ఎకరాల 27 గుంటల స్థలాన్ని 2004 సంవత్సరంలో లీజు పద్ధతిలో కేటాయించారు. స్థలం కేటాయించే ముందు షరతులు విధించారు. నియమ నిబంధలు ఉల్లంఘించకుండా నిర్ణీత పద్ధతిలో నిర్వహించాలని పేర్కొన్నారు. విరుద్ధంగా హెచ్‌సీఏ వ్యవహరిస్తోందని ఫిర్యాదులు వస్తున్నాయి. అసోసియేషన్ ఆధ్వర్యంలో కమర్షియల్ హోల్డింగ్స్, తినుబండారాలపై అధిక ధరలు వసూలు చేస్తూ సెలబ్రిటీ క్లబ్‌లను నిర్వహించడం, ఫంక్షన్ హాల్స్‌గా మారుస్తూ ఆధాయం సమకూర్చుకోవడం వంటి కార్యకళాపాలకు పాల్పడి లీజు షరతులను ఉల్లంఘిస్తున్నారని మేడ్చల్ జిల్లా ఆర్డీవో వీ.లచ్చిరెడ్డి ఆదేశాల ప్రకారం ఉప్పల్ తహ