రంగారెడ్డి

గత ప్రభుత్వాల కంటే ఎక్కువ అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 25: తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ అవినీతి రాజ్యమేలుతుందని ఎల్బీనగర్ టీజేఏసీ ఇన్‌చార్జి కేవీ రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం ఎల్బీనగర్ చౌరస్తాలో టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి ఛలో హైదరాబాద్ ఆవిర్భావ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమంలో 2001నుండి తెరాస అధినేత కేసీఆర్ వెంట ఉంటూ రాష్ట్ర సాధన కోసం జేఏసీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించినట్లు చెప్పారు.
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, మేధావులు అనేక కులాలకు చెందిన ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌కు మద్దతు తెలిపినట్లు గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యమకారులు, విద్యార్థుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలనను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని ఆరోపించారు. కార్పొరేటర్లు, మంత్రులు, అవినీతికి పాల్పడుతూ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు ఉద్యమకారులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు గోర శ్యాం సుందర్ గౌడ్, వీడబోయిని వెంకటేష్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.

మలేరియా నివారణకు కృషి చేయాలి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 25: మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మలేరియా నివారణకు కృషి చేయాలని అన్నారు. రెడీ టూ బీట్ మలేరియా కార్యక్రమాన్ని నిర్వహించాలని, మలేరియాను నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు. రాజేంద్రనగర్ కార్పొరేటర్ కోరణి శ్రీలత, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య, ఎంటమాలజీ ఏఈ గణేష్, సూపర్‌వైజర్ రవి పాల్గొన్నారు.
నష్ట పరిహారం పంపిణీ
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన 24 ఏళ్ల యువకుడి బాధిత కుటుంబానికి మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి రూ.4 లక్షల నష్ట పరిహారం ఇప్పించారు. బాబర్‌బాయ్, జైపాల్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ ధనుంజయ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టీ.చిన్న, శ్రీకాంత్ రెడ్డి, లోకేష్, భూషణ్ పాల్గొన్నారు.