రంగారెడ్డి

ఎస్పీ నేతృత్వంలో తాండూరులో కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 26: జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ నేతృత్వంలో గురువారం పట్టణంలోని గొల్ల చెరువు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల కార్డన్ సెర్చ్ సందర్భంగా గొల్లచెరువు కాలనీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు, ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 26 మోటార్ బైక్‌లు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా.. వారి పూర్తి వివరాలు సేకరించాక వదిలి వేశారు.
నేరాల అదుపు కోసమే పీడీ యాక్ట్
* ఎస్పీ అన్నపూర్ణ వెల్లడి
జిల్లాలో అన్నిరకాల నేరాలను అదుపు చేసేందుకే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయటానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేయటం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం తాండూరు పట్టణంలోని గొల్లచెరువు కాలనీ ఏరియాలొ కార్డన్ సెర్చ్ నిర్వహించిన సందర్భంగా జిల్లా ఎస్పీ మిడియాతో మాట్లాడుతూ.. పాత నేరస్తులు, నేరప్రవృత్తే లక్ష్యంగా సాగుతున్న నేరస్తులను అదుపు చేసేందుకే పీడీ యాక్టును ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. నేరాలు పునరావృత్తం కాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో నేరాలు మొదలు భారీ చోరీ లు, డెకాయిట్‌లు, కిడ్నాపింగ్ కేసులు, హత్యలు వంటి పెద్ద నేరాలు పి.డి యాక్టు ప్రయోగం ద్వార ఆగిపోతాయ ని ఎస్పీ అభిప్రాయం వ్యక్తం చేశా రు. తాండూరులో మట్కా మాఫీయా, ఇసుక మాఫీయా, పేకాట జూదం వం టి నేరాల పై ఉక్కు పాదం మోపినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. నేరస్తులు ఎం తటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నేరప్రవృత్తికి అలవాటు పడిన పాత నేరస్తులు సైతం ఇక ముందు నేరాలకు దూరంగా ఉండి ప్రశాంత సుక జీవ నం సాగించాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తాండూరు డి.ఎస్పీ ఎం.రామచంద్రుడు, పట్టణ,రూరల్ సీ ఐలు కే.ప్రతాప్ లింగం, చింతల సైది రెడ్డి, పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పీఎస్‌ల ఎస్సైలు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు పాల్గొన్నాయి.

ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
మేడ్చల్, ఏప్రిల్ 26: సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ డ్రైవర్లతో పాటు ప్రతి ఒక్కరు విధిగా రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీనియర్ పోగ్రామ్ అసోసీయేటర్ శ్రీనివాస్ సూచించారు. 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం మేడ్చల్ ఆర్టీసీ బస్సుడిపోలో డ్రైవర్లకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు ఏకాగ్రత ఎంతో ముఖ్యమని ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంతమైన మనస్సుతో డ్రైవింగ్ చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ప్రయాణీకులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చాలని వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ ఎమ్. ప్రకాశ్‌రావు, సూపర్‌వైజర్లు, సిబ్బంది, కార్మిక నాయకులు పాల్గొన్నారు.