రంగారెడ్డి

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 26: ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ‘రణభేరి’ బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ రకాల సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని వాపోయారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే మహేశ్వరం మండలం తుక్కుగూడలో బీజేపీ రణభేరి బహిరంగ సభను 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది బైక్‌లతో ర్యాలీగా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్ గౌడ్, చెంది మహేందర్ రెడ్డి, పీ.కృష్ణారెడ్డి, నందిగామ వెంకటేష్, కక్కునూరి వెంకటేష్ గుప్త, డాక్టర్ విజయ్‌కుమార్, మధుసూదన్ గౌడ్, మురళీ, కోనేరు శ్రీనివాస్, వంశీకృష్ణ, క్యామ మల్లేష్, వెంకటయ్య, లక్ష్మయ్య గౌడ్ పాల్గొన్నారు.
వనస్థలిపురం: చలో తుక్కు గూడ బీజేపీ రణభేరీ గోడపత్రికను మాజీ కౌన్సిలర్, రాష్ట్ర నాయకుడు కళ్లెం రవీందర్ రెడ్డి.. హయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కడారి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు పరిమితం అయ్యిరని, రాష్ట్ర ప్రజలను నమ్మిస్తూ అభివృద్ధిని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని విఫలం చేశారని అన్నారు. తుక్కుగూడలో తలపెట్టిన రణభేరీకి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వనం కోటయ్య, జక్కిడి మహేందర్ రెడ్డి, రాఘవేందర్, ప్రదీప్ నాయుడు, మహేష్ ముదిరాజ్, లింగాచారి పాల్గొన్నారు.
కేసీఅర్ గారడీ మాటాలతో మోసం
ఆమనగల్లు: ముఖ్యమంత్రి కేసీఅర్ తన గారడీ మాటాలతో ప్రజలను మోసం చేస్తుంన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజి ఆచారి అన్నారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో రెండు పడకాల ఇళ్ల సాధనకు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే రణభేరీ గోడ పత్రికలను విడుదల చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు దాటుతున్న ఎక్కడ కూడ డబుల్ బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేపట్టకపోవడం.. అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరయ్య, మోహన్ రెడ్డి, లక్ష్మన్, యాదగిరి, సాయిలాల్, శ్రీను, తులసీరాం, వెంకటేష్ గౌడ్, గణేష్, చందన్, కుమార్, మహేష్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 26: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి నేత, కార్యకర్త పని చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ అన్నారు. రానున్న మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం ఖాయమని అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో టీఆర్‌ఎస్ జెండావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణాలు మాఫీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ వంటి అనేక పథకాలను ప్రవేశపట్టారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లో అభివృద్ధి చేసేందుకు కేసీ ఆర్ ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్, నాయకురాలు లక్ష్మి, కుమార్, లలితమ్మ, లింగమ్మ, మంగమ్మ, బువమ్మ, యశోధరాణి, మాధవ్ రెడ్డి, యాదగిరి, ప్రవీణ్, స్వామిగౌడ్, శ్రీశైలం, క్రాంతి, సుధాకర్ గౌడ్, రాజు, శ్రీనివాస్, నర్సింహ్మా, అనిత, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.