రంగారెడ్డి

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 26: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.హరీష్ వివరించారు. గురువారం నందిగామ మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఎవరైన అక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రభుత్వ భూముల వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించి కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. నందిగామ మండల కేంద్రం పాత జాతీయ రహదారి పక్కన అక్రమించుకున్న ప్రభుత్వ స్థలాన్ని, మండల కేంద్రం సమీపంలో ఓ పరిశ్రమ నిర్వాహకులు కబ్జా చేసిన భూమిని పరిశీలించారు. అక్రమణకు గురైన స్థలాల్లో ప్రహారీ నిర్మించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేయడంతోపాటు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. పంపిణీలో అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
అధికారులు బృందాలుగా ఏర్పడి రైతులకు అందుబాటులో ఉంటూ పంపిణీ చేయాలని సూచించారు. ఒక్కొక్క అధికారి 300మంది రైతులకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో షాద్‌నగర్ ఆర్‌డీఓ ఎం.కృష్ణ, నందిగామ ఇన్‌చార్జి తహశీల్దార్ శకుంతల, ఆర్‌ఐ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

బీసీఎస్ యూనిట్ ప్రారంభం
వికారాబాద్, ఏప్రిల్ 26: మిమ్స్‌లో బ్లడ్ కాంపొనెంట్స్ సెపరేషన్ యూనిట్ ఏర్పాటు జిల్లా ప్రజలకు మంచి సదుపాయమని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. గురువారం మిమ్స్‌లోని బ్లడ్ బ్యాంక్‌లో యూనిట్‌ను ప్రారంభించారు. డెంగ్యూ, తలసేమియా, హిమోఫీలియా రోగాలు వచ్చిన వారికి రక్తం తప్పనిసరి అవసరమవుతుందని చెప్పారు. తలసేమియా వచ్చిన పిల్లలకు ప్రతి 40 రోజులకోసారి రక్తం అవసరమని పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదని మిమ్స్ నిర్వాహకులు చెప్పగా, కలెక్టర్ వెంటనే డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి అనుమతి ఎందుకు ఇవ్వలేదని, ఇవ్వాలని హుకుం జారీ చేశారు.

మూసీపై ‘కెనడా మీడియా’ అధ్యయనం
ఘట్‌కేసర్, ఏప్రిల్ 26: కాలుష్యకారక విషపూరిత జలాలతో ప్రజలకు హాని చేస్తున్న మూసీనది జలాలపై అధ్యయనం చేసేందుకు కెనడా దేశానికి చెందిన మీడియా ప్రతినిధులు గురువారం ఏదులాబాద్ గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. మండల పరిధి ఏదులాబాద్ గ్రామ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, విషపూరిత జలాలతో జరుగుతున్న ప్రమాదాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్, మూసి పరిరక్షణ సమితి కన్వీనర్ మూసీ శంకర్‌ను కలిసి వివరాలు తీసుకున్నారు. నగరంలోని పటాన్ చెరువు, జీడీమెట్ల పారిశ్రామికవాడల నుంచి రసాయనాల కంపెనీలు వదులుతున్న విషపూరిత రసాయనాలతో మూసీ పరివాహక ప్రాంతం కలుషితమైందని శంకర్ వివరించారు. మూసీ ప్రక్షాళనకు అనేక ఉద్యమాలు జరిపినట్లు పేర్కొన్నారు. విషపూరిత కాలుష్య కారక జలాలలతో స్థానిక ప్రజలు వైద్యులకే అంతుపట్టని రోగాల భారిన పడి మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించారు. ఏదులాబాద్ లక్ష్మినారాయణ చెరువు పర్యాటక కేంద్రంగా ఉండేదని, జంట నగరాల నుంచి అనేక కుటుంబాలు ఇక్కడ విడిది చేసేవారని, నేడు చెరువులు చేపలు సైతం బ్రతకటం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు వినతి పత్రాలు అందజేసిన పలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల స్థితిగతులు, పంటల దిగుబడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత సమస్యలను తెలుసుకున్న వారిలో కెనడా దేశానికి చెందిన మీడియా ప్రతినిధులు అలెంక్షంద్ర సాగన్, ఔర్యాకానే ఉన్నారు.