రంగారెడ్డి

నూతన పద్ధతిలో రేషన్ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: రేషన్ దుకాణాలలో నిత్యావసర సరుకుల సరఫరాను బయోమెట్రిక్ ద్వారా అందించేందుకు వినూత్న పద్ధతికి సివిల్ సప్లరుూస్ సర్కిల్ అధికారులు ఉప్పల్ సర్కిల్‌లో బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని దుకాణాలలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ (ఇపోస్) యంత్రాల్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంపై పలు అనుమానాలు ఉన్నాయంటూ గతంలో జరిగిన శిక్షణ తరగతులను డీలర్లు బహిష్కరించిన విషయం తెలిసిందే. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను రేషన్ డీలర్లు, డీలర్ల సంఘం ప్రతినిధులు తమ కఠినమైన నిబంధనలతో కూడిన ఇబ్బందులను మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. న్యాయమైన సమస్యలపై హామీ ఇవ్వడంతో ఈవిధానంపై శిక్షణ తీసుకోవడానికి డీలర్లు ఒప్పుకున్నారు. శాఖ నుంచి తీసుకున్న యంత్రాల ద్వారా ఇక నుంచి రేషన్ సరుకులను అందజేయడానికి సిద్ధమయ్యారు.

ఆస్తి పన్ను వసూలులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

ఉప్పల్, మార్చి 16: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ఆస్తిపన్ను వసూలుకోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్లలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.33కోట్లు ఉండగా ఇప్పటికి రూ.17కోట్లు మాత్రమే వసూలైంది. మిగిలిని రూ.16కోట్లకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
ఆస్తిపన్ను వసూలుకోసం ఎనిమిది మంది అధికారులు, సిబ్బంది చొప్పున ఏడు బృందాలను నియమించిన విషయం తెలిసిందే. ఒక్కొక్క బృందంలోని సభ్యులు ఉదయం తెల్లవాముఝాము నుంచే కాలనీలలోకి వెళ్లి ఎండలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి మరీ బ్రతిమిలాడుతూ వసూలు చేస్తున్నారు. ఒకవైపు తమ విధులను నిర్వహిస్తూనే మరొక వైపు ఆస్తిపన్ను వసూలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత సంవత్సరం లక్ష్యానికి చేరుకోవాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు. మొండి బకాయిలకు నోటీసులు జారీ చేస్తూ సకాలంలో చెల్లించకపోతే ఆస్తుల జప్తుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 36వేల ఇండ్లకు అసెస్‌మెంట్ చేయగా అనధికారంగా నిర్మించిన సుమారు 22వేల ఇళ్లకు అసెస్‌మెంట్ చేయాల్సి ఉంది. వీటికి అసెస్‌మెంట్ చేయకపోవడానికి కారణం నోటరీ పత్రాలు ఉండటమేనని పేర్కొన్నారు. నోటరీ పత్రాలు ఉన్న మురికివాడల్లో అనుమతి లేకుండానే బహుళ అంతస్థులతో ఇళ్లు, షాపుల నిర్మాణం చేపట్టి అద్దెలకు ఇస్తూ కార్పొరేషన్ ఆదాయానికి కోట్లల్లో గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసెస్‌మెంట్ చేసి ఆధాయాన్ని పెంచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహిరించే అధికారులు ఎందుకు వీరికి సౌకర్యాలను కల్పిస్తున్నారో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలనీలలో చిన్న ఇళ్లు నిర్మించుకుంటే చర్యలు తీసుకుంటున్న అధికారులు మురికివాడలలో బహుళ అంతస్థులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే కేసిఆర్‌తోనే సాధ్యం
రాజేంద్రనగర్, మార్చి 16: ప్రపంచంలోనే గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్న కేసిఆర్ కృషి ఎనలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అభివర్ణించారు. బుధవారం టిఆర్‌ఎస్‌లో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మిగూడ బస్తీకి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు చేరారు. ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ కేసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి అన్ని రాజకీయ పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
టిఆర్‌ఎస్ ఎవరినీ భయాందోళనకు, ప్రలోభాలకు గురి చేయడం లేదని, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, పల్లె చెరువు మినీట్యాంక్‌బండ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మినీ స్టేడియం, 111 జివో తదితర సమస్యలను పరిష్కరించేంత వరకు రాజీ పడకుండా పని చేస్తానని వెల్లడించారు.
వేసవికాలం దృష్టిలో పెట్టుకొని గత రెండు నెలల నుంచి ప్రజలకు మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, టిఆర్‌ఎస్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్, డేవిడ్, అడికె అర్జున్, కాశిగారి యాదగిరి, రాజు ముదిరాజ్, ఎన్ను శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్ ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో మహేందర్ ముదిరాజ్, శ్రీకాంత్, సిద్దు ముదిరాజ్, భాస్కర్, సుమన్, మహేష్, రమేష్, వెంకటేష్ ఉన్నారు.

బిసి సబ్‌ప్లాన్ ఊసెత్తని బడ్జెట్
ఇబ్రహీంట్నం, మార్చి 16: లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌లో బిసి సబ్‌ప్లాన్ ఊసెత్తకుండా బిసిలకు అన్యాయం చేశారని బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ కిల్లె గోపాల్, జిల్లా అధ్యక్షులు అరుణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అంకెల ఆర్భాటం, పేదలను మాయచేసే మాటల గారడీతో బిసిల సంక్షేమాన్ని విస్మరించే బడ్జెట్‌ను అర్థికమంత్రి ప్రవేశ పెట్టారని అన్నారు.
గతేడాది బడ్జెట్‌లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఈఏడాది 25వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కనీసం 2016-17 సంవత్సరంలోనైనా సబ్‌ప్లాన్‌ను ప్రకటిస్తారని ఆశించినప్పటికీ.. సబ్‌ప్లాన్ ఊసెత్తకుండా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి, బిసిలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జనాభాలో 52శాతం మేరా ఉన్న బిసిల ప్రయోజనాలు విస్మరిస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో బిసిలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 17, 18వ తేదీలలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చెపట్టడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ నాయకులు జంగయ్య, యాదయ్య, బ్రహ్మయ్య, యాదగిరి, పురుషోత్తం, శంకర్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ కృషి
పరిగి, మార్చి 16: రైతుల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పోలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి కూరగాయల మార్కెట్‌లో రైతుబజార్ దుకాణ భవన సముదాయ నిర్మానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు పరిగిలో అభివృద్ధి పనులు జరిగాయని టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన తరువాత మళ్లీ ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పరిగి సర్పంచ్ విజయమాల మాజీ చైర్మన్ బాబయ్య కలసి మంత్రి హరీష్‌రావుకు రైతు బజారు గురించి వివరించామని అన్నారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు నిధులు మంజూరు చేశారని చెప్పారు. పరిగి కూరగాయల మార్కెట్‌లో 72 షెట్టర్‌లు నిర్మిస్తామని ఇప్పడు 45 లక్షల నిధులతో పనులు ప్రారంభం చేస్తున్నామని చెప్పారు. ఇంకా కావలసిన నిధులు మంజూరి చేయించి తీసుకువస్తానని చెప్పారు. మండల పరిధిలోని గ్రామాలలో రైతులు తాము పండించిన కూరగాయలు నేరుగా తీసుకువచ్చి మార్కెట్‌లో అమ్ముకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఎండలో, వర్షంలో ఉంటు తాము తీసుకువచ్చిన కూరగాయలను కష్టపడి అమ్ముకునే వారని పేర్కొన్నారు. ఇక అలాకాకుండ నేరుగ రైతు బజారులోని దుకాణ సముదాయంలోని షెట్టర్‌లలో ఉంచి అమ్ముకోవాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యం పరిగిలో నిల్వ చేయటకు గోదాము లేదని అందుకు కావలసిన స్థలం ఇక్కడ లేకపోవడంతో జాఫర్‌పల్లిలో 6 కోట్ల రూపాయలతో గోదాము నిర్మిస్తున్నామని తెలిపారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉండటానికి కృషి చేస్తామని అన్నారు. సర్పంచ్ విజయమాల మాట్లాడుతు, హరీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్‌రావును రైతు బజారు గురించి కోరామని, పరిగి పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల గురించి నివేదికలు ఇచ్చామని రైతు బజారు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నాయకుడు సురేందర్ కుమార్, గోపాల్, రహీం, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

పోచారం ఇన్ఫోసిస్ వద్ద భూ సర్వే
ఘట్‌కేసర్, మార్చి 16: పోచారం పంచాయతీ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపనీ ఆదీనంలో ఉన్న ప్రభుత్వ రోడ్డుకు అధికారులు బుధవారం కొలతలు చేపట్టి సరిహద్దులు గుర్తించి మార్కులు చేశారు. పోచారం పంచాయతీ పరిధిలోని సర్వే 50లో నగరానికి చెందిన కొంత మందికి మూడు ఎకరాలకుపైగా భూమి ఉంది. అప్పట్లో పోచారం పంచాయతీ నుండి చెంగిచెర్ల గ్రామానికి 60 అడుగుల రోడ్డు ఉన్నట్లు మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు పంచాయతీ రికార్డులలో ఉంది. పోచారం పంచాయతీ పరిధిలోని సర్వే 47 నుంచి 50 వరకు ఇన్ఫోసిస్ ఐటి కంపెనీకి ప్రభుత్వం స్థలం కేటాయించటంతో కంపనీ యజమాన్యం చుట్టు ప్రహరీగోడ నిర్మించుకుని ఇనుప గేట్లు పెట్టారు. దీంతో 2009లో భూములు కోల్పోయిన బాధితులతో పాటు స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్డు ఇటీవల కలెక్టర్, హెచ్‌ఎండిఏ, రెవెనస్యూ అధికారులకు సర్వే జరిపి అక్రమణలకు గురైతే కూల్చివేతలు జరుపాలని ఆదేశాలు ఇవ్వటంతో బుదవారం హెచ్‌ఎండిఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఇన్‌చార్జి అధికారి సత్యమూర్తి, డిఎల్‌ఫిఓ మాజీద్, పోచారం కార్యదర్శి సునిత, సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, మండల విస్తరణాధికారి నర్సింగ్‌రావు, ఎంపిటిసి సభ్యుడు నానావత్ బిక్కునాయక్, కార్యదర్శి సునిత, జిల్లా భూసర్వే అధికారులు, టౌన్‌ప్లానింగ్ అధికారులు కబ్జాకు గురైనట్లు ఆరోఫణలు ఉన్న స్థలాన్ని కొలతలు జరిపారు. గతంలో ఉన్న రోడ్డు స్థలాన్ని గుర్తించి సరిహద్దులను గుర్తించి మార్కులు చేశారు. ఇన్‌చార్జి టౌన్‌ప్లానింగ్ అధికారి సత్యమూర్తి మాట్లాడుతూ ఆరోపణలు ఉన్న స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే జరిపి హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి స్థాయి సర్వే నివేదికను కలెక్టర్ అందజేయనున్నట్లు తెలిపారు. వెంటనే రోడ్డును కబ్జా నుంచి రక్షించి ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డు కబ్జాతో తమ పోలాలకు వెళ్లలేదని, పంటలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు ఆరోపించారు. తమ ప్లాట్లు తమకు వెంటనే అప్పగించాలని అధికారులను కోరారు.

శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలకం

సైదాబాద్, మార్చి 16: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు నూతన సాంకేతికత పద్ధతులు కీలకంగా మారాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. ఆ దిశగా నగరంలోని పోలీస్‌స్టేషన్‌లు కొత్త టెక్నాలజీను అందిపుచ్చుకొని ఆధునికరించడం అభినందనీయమని అన్నారు. బుధవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి నూతనంగా ఆధునీకరించిన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. స్టేషన్‌లో రిసెప్షన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం, స్టేషన్ పరిధిలోని చౌరస్తాలు, కాలనీలలో ఏర్పాటు చేసిన సిసికెమెరాల కమాండ్ కంట్రోల్ రూం, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సిస్టం, మొదటి అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రైం విభాగాల గూర్చి కమీషనర్ మహేందర్‌రెడ్డి.. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ, పోలీసులు ప్రజలకు దగ్గరై వారి సమస్యలు పరిష్కరించినప్పుడే వారికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. నూతన టెక్నాటజీని ఉపయోగించుకుని నగరంలో నేరాలు తగ్గించడంలో పోలీసులు సఫలీకృతులు అవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపోలీసు వ్యవస్థ బలోపేతానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో భాగంగా అన్ని పోలీస్‌స్టేషన్‌లను నూతన టెక్నాటజీతో ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ స్వాతీ లక్రా, తూర్పు మండలి డిసిపి డాక్టర్ రవీందర్, మలక్‌పేట ఏసిపి సుధాకర్, ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి, కార్పొరేటర్‌లు సింగిరెడ్డి స్వర్ణలతా శ్రీనివాస్‌రెడ్డి, తీగల సుచరితారెడ్డి పాల్గొన్నారు.

పోలీసు స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
గచ్చిబౌలి, మార్చి 16: నిత్యం బందోబస్తులు, దొంగలను పట్టుకోవడం, శాంతిభద్రతలలో తలమునకలై ఉండే పోలీసులు ఆటలలో మునిగిపోయారు. సైబరాబాద్ పోలీసుల 8వ వార్షిక స్పోర్ట్స్‌మీట్‌ను సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు. పోలీసులు ఎప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్‌ను కలిగి ఉండాలని, దానికోసం ఏదో ఒక క్రీడను ప్రతినిత్యం కొంతసేపు ఆడుతూ దేహదారుఢ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.
ప్రతి కానిస్టేబుల్ ఆరోగ్యంగా ఉండడానికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం నిర్వహించిన బ్యాక్‌వాక్ 50 మీటర్ల పోటీలో సివి ఆనంద్ మొదటి బహుమతి పొందారు. 100, 200, 300 మీటర్ల పరుగు పందెం, బాస్కెట్‌బాల్, షార్ట్ఫుట్, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్, టగ్ ఆఫ్ వార్, ఫుట్‌బాల్‌లలో పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్‌మీట్‌లో ఐదు జోన్ల నుంచి 250మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపి సివి ఆనంద్‌తోపాటు జాయింట్ సిపి శశిధర్‌రెడ్డి, మాదాపూర్ డిసిపి కార్తికేయ, శంషాబాద్ డిసిపి ఎఆర్‌ఆ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
జీడిమెట్ల, మార్చి 16: ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బౌరంపేట్ గ్రామానికి చెందిన సాయికుమార్ (20) ప్రైవేటు ఉద్యోగి.
సాయికిరణ్‌రెడ్డి(19) విద్యార్థి. మహేశ్, వెంకట్‌రాజు, చంద్రారెడ్డి కలిసి మంగళవారం అర్థరాత్రి బొల్లారంలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఎపి 23ఎజి 0515 నంబరు గల మారుతీ షిఫ్ట్ డిజైర్ కారులో వస్తున్నారు. కొంపల్లి 44 నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఎపి 29 టిఎ 7842 నంబరు గల లారీని కారు ఢీకొట్టింది.
ఘటనలో సాయికుమార్, సాయికిరణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా మహేశ్, వెంకటరాజు, చంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి గాయాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది.