రంగారెడ్డి

ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 20: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. ఆదివారం బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామం, బండారి లేఔట్, బృందావన్ కాలనీ, గ్రీన్‌ఫీల్డ్, ప్రశాంతిహిల్స్, మధురానగర్, రెడ్డి ఏవెన్యూ కాలనీలలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా మంచినీటి సరఫరా ట్యాప్ కనెక్షన్‌లను వివేక్ ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్.. వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని ఇంటింటికీ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వందల కోట్లతో రిజర్వాయర్‌లు, పైపులైన్‌లు, సంపులు, ట్యాంక్‌లను నిర్మిస్తున్నామని చెప్పారు. నిజాంపేట్ గ్రామాన్ని ఓ మోడల్‌గా, సేఫ్ స్మార్ట్ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఓ ప్రణాళికతో గ్రామంలో కోట్ల రూపాయలను వెచ్చించి అన్ని రంగాల్లో నిజాంపేట్‌ను అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. నాలాలు, కల్వర్టులు, చెరువులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా భూగర్భ జలాల నిలువ, క్రీడాకారులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. గ్రామంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరుస్తున్నామని, శాంతియుత సురక్షిత గ్రామంగా నిజాంపేట్‌ను తీర్చిదిద్దేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ శెనిగల ప్రమీల, బాచుపల్లి సీఐ బాలకృష్ణా రెడ్డి, తహశీల్దార్ భూపాల్, పంచాయతీరాజ్ ఈఈ రాంమోహన్, జలమండలి జీఎం ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

తరగతికి తగిన సామర్థ్య విద్య రావాలి

వికారాబాద్, మే 20: పిల్లలకు తరగతికి తగిన సామర్థ్యాలు తప్పనిసరిగా రావాలని విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమ రాష్ట్ర చైర్మన్ ఆర్.వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రవీంద్ర మండపంలో విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. నేటి సమాజంలో పిల్లలకు తరగతికి తగ్గ సామర్థ్యాలు రాకపోవడంతో అసమానతలు గల సమాజం ఏర్పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యను బోధించేందుకు, విద్యార్థి విద్యను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య (తరగతికి తగ్గ సామర్థ్యాలతో) రావడం లేదని వాపోయారు. దానికి ఉపాధ్యాయుడిదే బాధ్యత అని, విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమం అన్ని జిల్లాల్లో చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలందరికీ చదువుతో పాటు కనీస సామర్థ్యాలు తప్పక రావాలని అన్నారు. పిల్లలు డ్రాపౌట్ కాకుండా చూడాలని, అధికారులు నాణ్యమైన విద్య సామర్థ్యాల గురించి అడగాలని, విద్యపై నిరంతర మూల్యాంకనం జరగాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న తరగతుల (6 నుంచి 10) పిల్లలకు ప్రత్యేక బ్రిడ్జి కోర్స్ పద్ధతిని ఉపయోగించి చదువువచ్చేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయాలని వివరించారు. సమావేశంలో సాధన సంస్థ డైరక్టర్ చుక్క మురళీ మోహన్, ఎంవీఎఫ్ కోఆర్డినేటర్ నర్సింలు, సాధన ఉద్యమ రాష్ట్ర సభ్యులు సత్తయ్య, జనార్ధన్, ధనసిరి ప్రకాష్, పీవోడబ్ల్యూ గీత, నాగేశ్వర్, డీబీఎస్ నర్సింలు, రాంచంద్రయ్య, కిష్టయ్య, ఎంవీఎఫ్ వెంకటయ్య, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశ్, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు రాములు పాల్గొన్నారు.