రంగారెడ్డి

ఔషధనగరికి వ్యతిరేకంగా పోరాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 20: మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసే ఔషధనగరికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఆదివారం నగరపంచాయతీ పరిధిలోని శేరిగూడలోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఔషధనగరి ఏర్పాటయితే ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. భూమి, నీరు, వాయు కాలుష్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం ప్రాంతంపై దండెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరువుతో వ్యవసాయాన్ని మానుకున్నామని, ఫార్మాసిటీతో ఉన్న వ్యవసాయం కూడా అడుగంటిపోయే ప్రమాదమున్నదని చెప్పారు. ప్రజలు, రైతులు కూడా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి వారికి ఇష్టం లేకున్నా భూములు లాక్కోని కోట్లాది రూపాయలు దండుకున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఫార్మాసిటీ ఏర్పాటుపై పునరాలోచించి, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ప్రజలు, రైతులను కలుపుకునిపోయి ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకరయ్య, జిల్లా నాయకులు భరత్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నగేశ్, అంజయ్య, రవికుమార్, ధన్‌రాజ్, నరేందర్, శ్రీశైలం, అశోక్ గౌడ్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.

దళితుడే ముఖ్యమంత్రి అంటివి..ఏమైందీ?

కీసర, మే 20: దళితుడే ముఖ్యమంత్రి అంటివి, రాజ్యం నీవే ఏలవడ్తివి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం చీర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణకు సర్వే సత్యనారాయణ, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కే.లక్ష్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తల సమావేశంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో మాయల మాంత్రికుడు, బూటకపు నాయకుని పాలన నడుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొదట దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి పదవిని దళితునికి ఇచ్చి దళిత జాతిని అవమాన పర్చారని చెప్పారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతున్నాయని గ్రహించిన సోనియాగాంధీ.. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారని తెలిపారు. నేడు కేసీఆర్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని ఎద్దేవా చేసారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగడుతూ కార్యకర్తలు ముందుకు పోవాలని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో నేడు పాలిస్తున్న పాలకులు భూకబ్జాదారులుగా, కమీషన్ రాజాలుగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే ఇక్కడి ప్రజలు చమరగీతం పాడతారని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొర్గు ముత్యాలు, నాయకులు తోటకూర జంగయ్య యాదవ్, మహేశ్ గౌడ్, ఎంపీటీసీలు రమేశ్ గుప్తా, జంగయ్య యాదవ్, కోళ నర్సింహ, లక్ష్మీనాయణ, మొయినుద్దీన్, టీ.నారాయణ శర్మ, జూపల్లి రవీందర్, రాజు, శ్రీనివాస్, నర్సింగ్ రావు, టీ.్భనుశర్మ పాల్గొన్నారు.