రంగారెడ్డి

అధికారం మాదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మే 20: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలోని గణేష్ గార్డెన్‌లో కొత్తూరు, నందిగామ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని వాపోయారు. ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని అన్నారు. 2019లో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్.. రాష్ట్రంలో, కేంద్రంలో విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
సాగునీరు ఇస్తే పోటీ చేయను: చౌలపల్లి
ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు ఎవరు నమ్మవద్దని, షాద్‌నగర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తే 2019 ఎన్నికల్లో పోటీ చేయనని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎంపీపీలు శివశంకర్ గౌడ్, బుజ్జి నాయక్, ఆవుల గాయిత్రి, జడ్పీటీసీ పల్లె నర్సింగ్‌రావు, మండల పార్టీ అధ్యక్షులు జే.సుదర్శన్ గౌడ్, జంగ నర్సింహా, సింగిల్ విండో చైర్మన్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ కుమారస్వామి గౌడ్, మేకగూడ సర్పంచ్ మంజుల రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మ్యాదరి శ్రీను, సిద్దు, సోమ్లా నాయక్, ఎండీ లతీఫ్ పాల్గొన్నారు.

స్వపరిపాలన దిశగా పయనం: కడియం
కులకచర్ల, మే 20: తెలంగాణ ఏర్పాటయ్యాక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలుగన్న స్వపరిపాలన దిశగా పయనిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం రాత్రి కులకచర్ల మండలం బండవెనకచర్లలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, బాబాసాహెబ్ 125వ జయంతి సందర్భంగా తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయినపుడు 125 అడుగుల విగ్రహంతో పాటు 125 బడుగుబలహీన వర్గాలకి రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఇవ్వాలని సూచిస్తే, సీఎం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 540 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. దళితులు, గిరిజనులు విద్యా, ఆర్థికరంగాల్లో పురోగతి సాధిస్తే ఆంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్లేనని కడియం పేర్కొన్నారు.
బండవెనకచర్లలో కమ్యూనిటీ తాను, ఎంపీ విశే్వశ్వరరెడ్డి నిధులు రూ.10లక్షలు చొప్పున మొత్తంగా రూ. 20 లక్షలు మంజూరు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. 15 రోజుల్లో పని మొదలుపెట్టాలని కూడా సూచించారు. కులకచర్ల మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చారు. పరిగి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా ఇప్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. జోన్ పరిధి గురించి పలుమార్లు స్థానికులు చెప్పినా స్పందించలేదు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఒక డిగ్రీ కళాశాల మంజూరు వచ్చిందని తెలిపారు. జమ్ము కాశ్మీర్‌కు కల్పించిన ఆర్టిక్ 370ని వెంటనే రద్దు చేయాలని, అపుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని చేవేళ్ల ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశరెడ్డి, స్థానిక సర్పంచ్ రామలింగం, మాజీ జెడ్పీటీసీ మనోహరరెడ్డి, ఎంపీపీ గందె అరుణమ్మ, జడ్పీటీసీ మంజల, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.