రంగారెడ్డి

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 21: స్కూల్ బస్సుల్లో యజమానులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు షాద్‌నగర్ ఎంవీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయం ఆవరణలో ప్రైవేట్ పాఠశాల బస్సులకు తనిఖీ చేశారు. ఎంవీఐ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 15సంవత్సరాలు దాటితే బస్సు నడిపించరాదని, అలా ప్రైవేట్ పాఠశాలల యజమానులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్కూల్ బస్సుల్లో విద్యార్థులకు వౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనుభవం కలిగిన డ్రైవర్లను మాత్రమే స్కూల్ బస్సులకు పనిలో పెట్టుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. షాద్‌నగర్ డివిజన్‌లోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాలతోపాటు తలకొండపల్లి, ఆమన్‌గల్ మండలాలకు షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయం పరిధిలోకి వస్తాయని వివరించారు. ఎనిమిది మండలాల్లో గత ఏడాది మొత్తం 153స్కూల్ బస్సులు ఉండగా ప్రస్తుతం 90స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 15సంవత్సరాలు దాటిని బస్సులను తొలగించామని, వాటి స్థానంలో కొత్తబస్సులను తెచ్చుకోవాలని ఇప్పటికే స్కూల్ యజమానులకు సూచించినట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న 90స్కూల్ బస్సుల్లో ఇప్పటి వరకు 13స్కూల్ బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. మరో 77స్కూల్ బస్సులు తనిఖీ కోసం ఎంవీఐ కార్యాలయానికి రావాల్సి ఉందని వివరించారు.