రంగారెడ్డి

ఇలా అయతే ఇల్లు కట్టుకోవడం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: హైదరాబాద్ మహానగరంలో సామాన్య ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. విశ్వనగరంలా అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో ప్లాటు కొనడం మొదలు ఇల్లు నిర్మించుకుని జీవించడం వరకు అనీ కష్టాలే ఎదుర్కోవలసి వస్తోందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందరికి వౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని చెపుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై పన్ను భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశాన్నంటుకున్న ధరలు హైదరాబాద్‌లో చుక్కలు చూపిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు సొంతింటి కలలు నెరవేర్చుకోవడానికి ఎన్నో బాధలు పడుతూ అప్పులు చేసుకుంటూ ప్లాటు కొనుగోలు మొదలు ఇళ్లు నిర్మించుకునేంత వరకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోవడం తప్పడంలేదు. లక్షలు వెచ్చించి వంద గజాల స్థలం కొనుగోలు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌కోసం లక్షకు పైగా వెచ్చించిఇల్లు నిర్మించుకోవడం కోసం వేల రూపాయలు సంబంధిత మహానగర పాలక మండలికి చెల్లించక తప్పడంలేదు. అనుమతితో ఇళ్లు నిర్మించుకుంటే అనుమతి ప్లానుకు విరుద్ధంగా 10శాతం లోపు అయితే మున్సిపల్ అధికారులు ఇంటికి అసెస్‌మెంట్ చేసి అండర్ సెక్షన్ 2013 ప్రకారం 25 శాతం ఆస్తిపన్ను విధిస్తున్నారు. 10శాతం పైగా అయితే ప్లానుకు విరుద్ధంగా నిర్మిస్తే 50శాతం, ఏ మాత్రం ఇంటికి అనుమతి లేకుంటే వంద శాతం ఆస్తిపన్ను విధించి వసూలు చేస్తుండటంతో మోయలేని భారంగా తయారైందని ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రెసిడెన్సియల్ అనుమతితో కమర్శియల్ మడిగలు నిర్మిస్తే కమర్షియల్ పన్ను విధిస్తున్నారు. రెసిడెన్షియల్ ఇంట్లో స్కూల్, హాస్టల్, కుటీర పరిశ్రమ నిర్వహించినా కమర్షియల్ పన్ను వసూలు చేస్తున్నారు. అనుమతి తీసుకున్న ఇంటికి పట్టణ ప్రణాళికా విభాగం నుంచి ఆక్యుఫెన్సీ (ఓసి) సర్ట్ఫికెట్ తీసుకోకుంటే సదరు ఇంటికి వినియోగిస్తున్న నల్లా, విద్యుత్ బిల్లులు మూడింతలు వసూలు చేయాలన్న నిబంధన ప్రజల ఆగ్రహాన్ని కల్గిస్తుంది. ఇది కొన్ని ప్రాంతాలలో అమలవుతుండటంతో సామాన్య ప్రజలు పన్నుభారం మోయలేక ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయే ఆలోచనలో పడ్డారు. గతంలో అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించుకుంటే 25శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలు చేస్తుండేది.
ప్రస్తుతం డీవియేషన్ పేరుతో అధికంగా వసూలు చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కొందరు ఇంటి యజమానులు అధిక పన్నుకు భయపడి అమ్ముకుని వెళ్లిపోతుండగా మరి కొందరు బిపిఎస్ కింద దరఖాస్తు పెట్టుకున్నారు.
మురికి వాడల్లో పన్ను వసూలేది?
హైదరాబాద్ మహానగరంలోని మురికివాడల్లో నిర్మించుకున్న ఇళ్లకు ఆస్తిపన్ను వసూలు చేయడమేలేదు. ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న పేదల ఇళ్లకు రూ.1200 ఆస్తిపన్ను ఉంటే కేవలం రూ.101 మాత్రమే చెల్లించాలని, మిగతా పన్ను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. పేదలు ఆస్తిపన్ను విషయంలో ఆనందం వ్యక్తం చేస్తుండగా సామాన్య ప్రజలు ఆస్తిపన్ను భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో శ్రమించి కష్టపడి చిన్న ప్లాటు కొనుగోలు చేసుకుని ఎల్‌ఆర్‌ఎస్, అనుమతితో ఇళ్లు నిర్మించుకుంటే డీవియేషన్ ఉందంటూ 50శాతం ఆస్తిపన్ను చెల్లించడం బాధాకరమని ప్రజలు వాపోతున్నారు. రెండు వందల గజాల స్థలమైతే డీవియేషన్ లేకుండా ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందని, వంద, లేదా 150 గజాల స్థలంలో ప్లాను ప్రకారం ఎలా నిర్మించుకునే వీలు ఉంటుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఉన్న ఇళ్లకు డీవియేషన్ విధానాన్ని రద్దుచేసి నార్మల్ ఆస్తిపన్ను విధించాలని ప్రజలు మున్సిపల్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇకపోతే నోటరీ స్థలాల్లో చిన్న ఇల్లుతో పాటు బహుళ అంతస్థులతో నిర్మించినా ఆస్తిపన్ను వసూలు చేయడంలేదు. అనుమతి లేకుండా రెసిడెన్సియల్, కమర్షియల్‌గా నిర్మించుకుని అద్దెలకు ఇస్తూ లక్షలు సంపాదిస్తున్న వారి నుంచి చిల్లి పైసా వసూలు చేయడంలేదని తెలిసింది. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నోటరీ ఇళ్లకు అసెస్‌మెంట్ చేసే అధికారం మాకు లేదని సునాయసంగా తప్పించుకుంటున్నారు. అక్రమంగా వెలసిన కాలనీలలో అన్ని వౌలిక వసతులను కల్పించం శోచనీయం.
ఆస్తి మార్పిడికోసం ఇబ్బందులెన్నో
హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ సర్కిల్‌లో నోటరీ పత్రాలతో నిర్మించుకున్న ఇళ్లను అవసరాల నిమిత్తం అమ్ముకుంటే కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ పత్రం ఉన్నా ఆస్తిమార్పిడీ జరుగడంలేదు. లింక్ డాక్యుమెంట్లు అన్నీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటేనే ఆస్తి మార్పిడీ చేస్తామని అధికారులు చెప్పడంతో వందల్లో ఆస్తి మార్పిడి ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. గతంలో ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఇళ్లు కాకుండా కొత్తగా నోటరీ పత్రాలతో అనుమతి లేకుండా నిర్మించుకుంటున్న ఇళ్లకు అసెస్‌మెంట్ చేయకపోవడంతో ఇంటి నెంబర్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
హైదరాబాద్ మహానగరంలో ఆస్తిపన్ను, నోటరీ పత్రాలపై ఆస్తిమార్పిడి వంటి సమస్యలపై నూతన కార్పొరేటర్లు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. జిహెచ్‌ఎంసి సమావేశంలో మేయర్, మంత్రుల దృష్టికి తీసికెళ్లి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా కృషి చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా అనుమతి ఉన్నా 10శాతంకు పైగా డీవియేషన్ ఉంటే యాభై శాతం ఆస్తిపన్ను, అనుమతి పూర్తిగా లేకుంటే వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అవసరమైతే ఆందోళన చేపట్టడానికైనా వెనుకాడవద్దన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించి సామాన్య ప్రజలపై భారం పడకుండా ఆస్తిపన్ను తగ్గించేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఒత్తిడి తీసుకరావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ తెలంగాణలో ప్రజలపై భారం మోపమని చెప్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు.