రంగారెడ్డి

రైతుబంధు ఫిర్యాదులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కలు పంపిణీల్లో తలెత్తిన తప్పులను, ఫిర్యాదులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి తహశీల్ధార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు తీసుకోని రైతులు నేరుగా తహశీల్ధార్ కార్యాలయంలో తీసుకోవాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేయటానికి వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖరీఫ్ పంటలకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయట తిరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్సలు అందించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అవసరమైన చోట ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్ధలాలు కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 104 గ్రామాల్లో మిషన్ భగీరథ పనుల్లో భాగంగా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేశామని, 66 గ్రామాలు గ్రామ పంచాయతీలకు అప్పగించామని అధికారులు వివరించారు. 30 గ్రామాల్లో పంచాయితీలకు అప్పగించటానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మిగిలిన ఎనిమిది గ్రామాల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయని త్వరలో పూర్తిచేస్తామని వివరించారు. దేశ స్థాయిలో అవార్డు అందుకున్న బోడుప్పల్, ఫిర్జాదిగూడ మున్సిపల్ అధికారులు ఉపేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, డీఎంఅండ్‌హెచ్‌వో దాస్యా నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జ్యోతి పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ
ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 76 ఫిర్యాదులు అందాయని తెలిపారు. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామం సర్వే నెంబర్ 345లో 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇటీవల ఆ భూమిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశారని, నష్ట పరిహారం చెల్లించలేదని, కళాశాలలో జీవనోపాధికి ఉద్యోగం కల్పిస్తామని అధికారులు తెలిపారని బాధితులు తురి శంకరమ్మ విన్నవించారు. నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామానికి చెందిన నల్ల నర్సింగ్ రావు వారసత్వంగా 4.38 గంటల భూమి సంక్రమించిందని, తాను ఎలాంటి భూమి ఇతరులకు అమ్మలేదని, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో 2.5 గుంటల భూమి వేరే ఖాతాలోకి మారిందని, వారి పేరుమీద పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులు వచ్చాయని తెలిపారు. జరిగిన పొరపాటును సవరించి న్యాయం చేయాలని కోరారు.
కీసర మండలం భోగారం అనుబంధ గ్రామమైన బర్సిగూడకు సర్వే నెంబర్, నక్ష లేదని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎవరికి ఎంత భూమి ఉందో తెలీటం లేదని వివరించారు. అధికారులు వెంటనే సర్వే నెంబర్, నక్ష ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. జేసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.