రంగారెడ్డి

తెలంగాణను టీడీపీ ఆదుకుంది: రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మే, 21 టీడీపీ మహానాడు కార్యక్రమం శంషాబాద్ పట్టణంలో మైఫేయిర్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల దాకా కార్యకర్తలంతా సైనికులుగా పనిచేసి ప్రజల మద్దతు పొందడమే శ్రీరామ రక్ష అని అన్నారు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే పుట్టిందని అన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని, ప్రజలను ఉచిత పథకాలు అంటూ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణాలకు అడ్డగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీనికి సాక్ష్యం మియాపూర్, ఘాన్సిమియా గూడలో జరిగిన సంఘటనలే ఆధారమని అన్నారు. ప్రతి ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రజలను మోసం చెయ్యడానికే ఉచిత పథకాలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప అభివృద్ధి చేసిందేమిలేదని చెప్పారు. టీడీపీ హాయంలో ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటేక్ సిటీలను నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మాటలను మరిచే చరిత్ర కేసీఆర్‌కే సొంతమని అన్నారు. దేశంలో మహిళ మంత్రి లేని రాష్ట్రం అంటూ ఉంటే అది తెలంగాణ రాష్టమ్రే, కేసీఆర్‌కు మహిళలపై ఎంత ప్రేమ వుందో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో కూడా కేసీఆర్ ఇంటి పాలననే నడుస్తుందని విమర్శించారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమానికి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో శంషాబాద్ మొత్తం పసుపు రంగుగా మారింది. దీంతో నాయకుల్లో కొత్త జోష్ వచ్చినట్టు కనిపించింది. కార్యక్రమంలో టీడీపీ జాతీయ నేత అరవింద్ గౌడ్, రాష్ట్ర నేతలు బుక్క వేణుగోపాల్, గణేష్ గుప్తా, సామ భూపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, టీడీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వీరెందర్ గౌడ్, స్థానిక నాయకులు జహంగీర్ ఖాన్, జ్ఞానేశ్వర్ యాదవ్, సర్పంచ్ విజయలక్ష్మీ సిద్ధులు, మాధవి యాదయ్య పాల్గొన్నారు.