రంగారెడ్డి

మత సామరస్యం.. సమాజహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 24: శాంతి మత సామరస్యం సమాజ హితానికి దోహదపడుతాయని తాండూరు డీఎస్పీ ఎం.రామచంద్రుడు ఉద్ఘాటించారు. గురువారం పట్టణంలోని తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో రంజాన్ పవిత్ర ఉపవాస దినాల సందర్భంగా నిర్వహించిన శాంతి సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఎల్లప్పుడు నెలకొని ఉండాలని, దాంతో సమాజాభివృద్దికి అది ఉపకరిస్తుందన్నారు. అన్ని మతాల వారు ఎదుటి మతం వారి మనోభావాలను గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన సమాజంలో అన్ని మతాల పండుగలు, జాతరలు, ఉత్సవాలు అన్ని వర్గాల సహకారంతో శాంతి యుతంగా కొనసాగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. రంజాన్ పర్వ దినం, తదనంతరం గణేష్ ఉత్సవాలు, దసరా, దీపావళీ, సంక్రాంతి, క్రిస్‌మస్ వంటి మతాల పండుగలు ఉత్సవాలు ప్రతి ఏడాది మాదిరిగా వస్తుంటాయని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ బి.సునీతా సంపత్ మాట్లాడుతూ.. పట్టణంలో రంజాన్ పవిత్ర ఉపవాస దినాలను పురస్కరించుకొని ముస్లింలకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ఈద్గాల వద్ద సకల ఏర్పాట్లు చేపడుతామని అన్నారు. పట్టణ సీఐ కే.ప్రతాప్ లింగం మాట్లాడుతూ పోలీస్ శాఖ మాన్యువల్, రూల్స్ ప్రకారం ప్రతి రెండు మూడు నెలలకు ఓక సారీ నిర్వహించటం జరుగుతుందన్నారు. పండుగలు, పర్వ దినాలు శాంతి యుత వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు నిర్వహించుకోవాలని సీఐ సూచించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎ.విశ్వనాథ్ గౌడ్, కొట్రిక విజలక్ష్మీ, సీపీఐ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మీ పండిత్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ హాజరయ్యారు.

జోన్ల ఏర్పాటులో అన్యాయం చేస్తే ఉద్యమమే
*కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి హెచ్చరిక
వికారాబాద్, మే 24: జోన్ల ఏర్పాటు విషయంలో వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యమం చేపడతామని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పీ.కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల కోసం సీమాంధ్ర పెత్తందార్లపై పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంపూర్ణ న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా కొత్త జిల్లా పేరిట వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని వాపోయారు. 40 సంవత్సరాల ఆకాంక్షయైన వికారాబాద్ జిల్లాను ఆదాయం, ఉద్యోగావకాశాలు, నీళ్లులేని జిల్లాగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇటు ప్రాణహితను అడ్డుకుని నీరు రాకుండా చేయగా, ఏడో జోన్‌లో కలిపి ఉద్యోగావకాశాలు రాకుండా చేశారని, ఆదాయాలు లేని మండలాలతో పూర్తిగా పేద జిల్లాగా ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఉన్న ఆరో జోన్‌లో వేయాలని, ఏడో జోన్‌లో వేస్తే పూర్తిగా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని, జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు బాధ్యత మీద వేసుకుని ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. ఏడో జోన్‌లో వేస్తే, ఉద్యోగం, చదువు అన్ని విషయాల్లో జిల్లా వెనుకబడిపోతుందని అన్నారు. ప్రజా సంఘాలు, అఖిలపక్షంతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాలతో పాటు నవాబ్‌పేట మండల ప్రజలతో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. డీసీసీబీ డైరక్టర్ ఎన్.కిషన్ నాయక్ మాట్లాడుతూ ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని వాటిని ఆపేందుకు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను జిల్లాలో రూపాయైనా ఖర్చు చేయలేదని వాపోయారు.