రంగారెడ్డి

డివిజన్ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 24: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ను గ్రేటర్‌లోనే ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి డివిజన్ పరిధిలోని మధుబన్‌కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ను గతంతో పోలిస్తే సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని అన్నారు. బాధ్యతా రాహిత్యంగా నాణ్యతను పక్కనబెట్టి అభివృద్ధిని గాలికి వదిలేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వార్డు సభ్యులు బుచ్చిరెడ్డి, మహిపాల్, శివ, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, చిన్నా, గోపి, రాజశేఖర్, ఎల్.వి.రెడ్డి, పాషా, పి.శ్రీను, కేబుల్ శ్రీను పాల్గొన్నారు.
జీపీ ఉద్యోగుల జీతాలు పెంచాలి
వికారాబాద్, మే 24: గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు వెంటనే పెంచాలని ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్ డిమాండ్ చేశారు. గురువారం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సందర్భంగా బాల్‌రాజ్ మాట్లాడుతూ పొరుగు రాష్టమ్రైన కర్ణాటకలో ఉద్యోగులను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచారని చెప్పారు. అన్ని రంగాల కార్మికుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోనయ్య, కోశాధికారి బీ.నర్సింలు, ఉద్యోగులు అనంతయ్య, శ్రీనివాస్, నర్సప్ప, బాలయ్య, రత్నయ్య, బసప్ప, పెంటారెడ్డి, చంద్రమ్మ, సుశీలమ్మ, నర్సమ్మ పాల్గొన్నారు.
పథకాలతో మభ్యపెడుతున్న ప్రభుత్వం
నేరేడ్‌మెట్, మే 24: రైతుబంధు పథకం పేరుతో తెరాస ప్రభుత్వం.. ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుందని టీడీపీ మల్కాజిగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల రాధాకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. గురువారం నాంపల్లిలో జరిగే టీడీపీ మహనాడు కార్యక్రమానికి మల్కాజిగిరి నుంచి నాయకులు పెద్దఎత్తున్న తరలి వెళ్లారు. సఫిల్‌గూడలోని ఎన్‌టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రైతుబంధు పథకంతో అర్హులైన రైతులకు ఎక్కడ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. నగరంలో ఉండి గ్రామీణ ప్రాంతాలలో వందల ఎకరాలు భూములు ఉన్న బడాబాబులకు రైతుబంధు పథకం ఇవ్వడంతో సామాన్య రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బోద్దున రాము, వై.సుధాకర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, సురేష్ సింగ్, వగ్గు చంద్రశేకర్, పిట్ల నందు, భాస్కర్, గణేష్ ముదిరాజ్, స్వర్ణలత, నర్సమ్మ, భారతి, వెంకటేష్, ఇస్తారీ, సత్యమూర్తి పాల్గొన్నారు.