రంగారెడ్డి

కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, మే 24: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గురువారం మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ను సతీమణితో కలిసి సందర్శించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని పర్యాటక ప్రాంతమైన అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌కు మూడు రోజలు విడిది కోసం బుధవారం వచ్చారు. గురువారం సాయంత్రం వికారాబాద్ జిల్లా పరిధిలోని పెద్ద ప్రాజెక్ట్ కోట్‌పల్లిని సందర్శించారు. ప్రాజెక్ట్‌ను పరిశీలించి నీటి లభ్యతపై అధికారులను తెలుసుకున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ వివరించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారాంతపు సెలవు రోజుల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. అనంతరం సతీమణితో కలిసి బోటింగ్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ గవర్నర్ సతీమణికి తోడుగా బోటింగ్ చేశారు. బోటింగ్ నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులకు సరైన సేవలు అందించడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఒమర్ జలీల్, ఎస్పీ అన్నపూర్ణ, వికారాబాద్ డిఎస్పీ శిరీష, వికారాబాద్ ఆర్డీవో విశ్వనాథం, వికారాబాద్ తహశీల్దార్ చిన్నప్పల నాయుడు, వికారాబాద్, ధారూర్ సిఐలు వెంకట రామయ్య, ఉపేందర్ పాల్గొన్నారు.

పాస్‌పుస్తకాలు, చెక్కులు త్వరగా అందించాలి
వికారాబాద్, మే 24: జిల్లాలో రైతుబంధు పథకం కింద రైతులకు మిగిలిపోయిన పాస్‌పుస్తకాలు, చెక్కులను త్వరితగతిన అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఆర్డీవోలు, నోడల్ అధికారులు, తహశీల్దార్లతో పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్‌పుస్తకాలు అందజేయకపోవడానికి కారణాలపై తహశీల్దార్లతో సమీక్షించారు. పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిచేసి త్వరితగతిన పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుకోకుండా దొర్లిన తప్పులు కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా చేసిన తప్పుల విషయంలో సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాస్‌పుస్తకాలు, చెక్కులు కార్యాలయాల్లో కాకుండా రైతు సమన్వయ సమితి, ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామాల్లో పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆధార్‌కార్డు లేని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో వాటిని అందజేయవద్దని సూచించారు. రైతులకు బీమా వర్తింపజేసేందుకు వీలుగా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలతో పాటు నామినీ పేరును నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపర్చి సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా జిల్లాలో మసీద్‌ల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ అధికారి సబితకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందించే గిఫ్ట్ ప్యాక్‌లను మజీద్ కమిటీ సభ్యులకు అందజేయాలని తెలిపారు. ఇఫ్తార్ విందులకు ప్రజాప్రతినిధులతో పాటు కులాలకతీతంగా అందరిని ఆహ్వానించాలని వివరించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే.అరుణ కుమారి, వ్యవసాయ శాఖ అధికారులు లావణ్య, రమాదేవి, భారతి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రవీందర్ పాల్గొన్నారు.
భూప్రక్షాళనలో దొర్లిన తప్పులను సవరించాలి
కీసర: భూ ప్రక్షాళనలో దొర్లిన తప్పులను సవరించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు చేసిన ఫిర్యాదులను, సలహాలను పాటించి వెంటనే సరి చేయాని అన్నారు. పంపిణీకాని పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కులను గ్రామాల వారీగా రైతులకు అందజేయాలని తెలిపారు. ధరణి పోస్టర్ అన్ని మండలాల్లో అందుబాటులో ఉంటుందని, ఎకరాలు తప్పు ఉంటే వెంటనే సరి చేయాలని అన్నారు.
రైతు సమన్వయ సమితీల సూచనలు తీసుకోవాలని కోరారు. తహశీల్దార్‌లు ధరణి పోస్టర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట ఇన్యూరెన్స్ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని వెల్లడించారు. మీ-సేవ దరఖాస్తులను తహశీల్ధార్‌లు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఓ కౌటిల్య, ఆర్డీఓలు లచ్చిరెడ్డి, మధుసూదన్, జిల్లా వ్యవసాయాధికారి అజయ్ కుమార్ పాల్గొన్నారు.