రంగారెడ్డి

ఉద్యోగుల కుటుంబాల్లో పింఛను రికవరీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, డిసెంబర్ 1: నిరాదరణకు గురయిన, నిరుపేదలకు కాకుండా ఉద్యోగుల కుటుంబాల్లో ఆసరా పింఛన్లు పొందిన డబ్బులను రికవరీ చేయాలని వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి అన్నారు. మంగళవారం మండల స్ర్తి శక్తి భవనంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటివరకు ధారూర్ మండల పరిధిలో 17 ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందినవారు ఆసరా పింఛన్లను పొందుతున్నారని వారినుండి రూ.13వేల చొప్పున రికవరీ చేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. రూ.2,21,000వేలను బాంకులో జమ చేయాలని అన్నారు.
డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేసి వేలం వేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హత లేకున్నా ఆసరా పింఛను పొందిన వారినుండి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసేందుకు నోటీసులు జారీచేశారు. గ్రామ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుల, ఆదాయ సర్ట్ఫికెట్‌లు సకాలంలో అందజేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్కాలర్‌షిప్ చెల్లించేందుకు బ్యాంకు ఖాతాలను తీయించాలని మండల విద్యాధికారి బాబుసింగ్‌ను ఆదేశించారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రాళ్ళచిట్టంపల్లి, గోధుమగూడ, హరిదాస్‌పల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు.