రంగారెడ్డి

ప్రజా సేవకు పోలీసు ఉద్యోగం మంచి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 25: ప్రజలకు సేవంలదించేందుకు పోలీసు ఉద్యోగం మంచి అవకాశమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మేరీ ఏ నాట్స్ పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ పోటీ పరీక్షల అభ్యర్థుల ఉచిత శిక్షణను సందర్శించారు. నరసింహన్ మాట్లాడుతూ శిక్షణను ఇవ్వడం మంచి ఆలోచనని చెప్పారు. లోకంలో ఏమి జరుగుతుంది, పరీక్షలు ఎలా రాయాలనే విషయం తెలుస్తుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటే అభ్యర్థులు ఫలితం పొందుతారని పేర్కొన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణతో పాటు కంప్యూటర్ శిక్షణ నేర్చుకుంటే ఇతర ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. మాల్స్ తదితరాల చోట ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. లాఠీతో భయపడే కాలం పోయిందని, స్నేహ పూర్వక వాతావరణంలో పోలీసు శాఖ పనిచేస్తోందని తెలిపారు. ఉచిత శిక్షణకు గవర్నర్ లక్ష రూపాయలను ప్రకటించారు. గవర్నర్ కోరిక మేరకు మాట్లాడిన అభ్యర్థులు శరణ్య, రాఘవేందర్ ఇది తమకు మంచి అవకాశమని హైదరాబాద్‌కు వెళ్లి కోచింగ్ తీసుకోవాలంటే డబ్బుతో పాటు ధైర్యం అవసరమయ్యేదని వివరించారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ శిక్షణ కోసం 5000 మంది ముందుకు రాగా 1200 మందిని ఎంపిక చేసి శిక్షణతో, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని, 33 శాతం బాలికలకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఎస్పీ టీ.అన్నపూర్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిధులతో తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ శిక్షణ వివరాలను అభ్యర్థుల నుంచి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో గవర్నర్ మాట్లాడి పోలీసు ఉద్యోగం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమల, జాయింట్ కలెక్టర్ కే.అరుణ కుమారి, డీఎస్పీ శిరీష పాల్గొన్నారు.
పద్మనాభ స్వామి ఆలయంలో
గవర్నర్ దంపతుల పూజలు
అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో వేసవి విడిదిలో భాగంగా బసచేసిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం ఉదయం శ్రీ అనంత పద్మనాభస్వామిని ఏకాదశి సందర్భంగా నిజరూపంలో దర్శించుకుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం నుండి పూర్ణకుంభం, వేద మంత్రాలతో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి అర్చన చేసే క్రమంలో గవర్నర్ దేవాలయ అర్చకులతో పాటు వేదమంత్రోచ్ఛారణ చేశారు. ఆ తర్వాత ఆలయం ముందు భాగంలో ఉన్న దీపస్తంభం వద్ద దీపారాధన, ధ్వజ స్థంభం వద్ద పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈసందర్భంగా ఇక్కడ వాతావరణం చాలా బాగుందని గవర్నర్ కితాబిచ్చారు. అర్చకులు ఆశీర్వచన మంత్రాలు చదవగా, ఆలయ ఫౌండర్ ట్రస్టీ నాళాపురం సీతారామాచార్యులు అటవీ శాఖ నుండి ఎదురవుతున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా విషయం తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ దంపతులకు స్వాగతం పలికిన వారిలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కే.వినోద్, అనంతగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి జీ.శేఖర్‌గౌడ్ ఉన్నారు.
గవర్నర్‌ను కలిసిన మంత్రి
వేసవి విడిదిలో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక కేంద్రం హరిత రిసార్ట్స్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి కలిసారు. అనంతరం కుశల ప్రశ్నలు వేసుకుని అనంతగిరి గొప్పతనం గురించి వివరించారు. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయ వైశిష్ట్యం, ప్రకృతి రమణీయత, స్వచ్ఛమైన గాలితో అనంతగిరికి హవా లాఖో మరీజోంకా దవా అని మంత్రి మహేందర్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఎస్పీ అన్నపూర్ణ, జేసీ అరుణకుమారి ఉన్నారు.
ముగిసిన గవర్నర్ వేసవి విడిది
అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో బసచేసిన గవర్నర్ దంపతుల వేసవి విడిది ముగిసింది.
బుధవారం సాయంత్రం రిసార్ట్స్‌కు చేరుకున్న గవర్నర్ దంపతులు గురువారం కోట్‌పల్లిలో బోటింగ్ చేయగా, శుక్రవారం ఉదయం శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణలో హాజరై ప్రసంగించారు. గవర్నర్ రాక సందర్భంగా అనంతగిరి, వికారాబాద్ పట్టణాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పరిస్థితులను కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికపుడు వాకబు చేశారు.