రంగారెడ్డి

వదంతులు నమ్మి నేరాలకు పాల్పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 25: వదంతులను నమ్మి నిండు ప్రాణాలను బలి తీసుకునే యత్నాలకు యువత స్వస్తి పలకాలని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్ గ్రామంలో సోషల్ మీడియా వదంతులపై జరిగిన అవగాహన సదస్సు కమీషనర్ మహేష్ భగవత్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కొంత మంది నేరస్థులు వచ్చి గ్రామాలలోని చిన్న పిల్లలను, వృద్దులను, ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్లను చంపేస్తున్నారని ఆకతాయిలు చేసిన వదంతులను నమ్మి చాలా చోట్ల అమాయకులను చితకబాది చంపేస్తున్నారని చెప్పారు. చట్టాన్ని చేతిలోనికి తీసుకుని నేరస్థులను శిక్షించాలనుకోవటం పెద్ద నేరం అవుతుందని చెప్పారు. గ్రామాలలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఎవరు నేరాలకు పాల్పడినా నిజం తెలిసి పోతుందని పేర్కొన్నారు. ఎవరైనా నేరస్థులు కనపించినట్లైతే 100 నెంబర్ డయల్ చేసి వివరాలు అందజేస్తే 10 నిమిషాలలో పోలీసులు చేరుకుంటారని తెలిపారు. తప్పుడు సమాచారం అందించే వారు సైతం నేరానికి పాల్పడినట్లు పరిగణించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రమేశ్ నాయుడు, మల్కాజిగిరి ఏసీపీ సందీప్, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పీ.రఘువీర్ రెడ్డి, ఎస్సైలు చంద్రశేఖర్, అనిల్ పాల్గొన్నారు.

మీ భద్రత బాధ్యత మాదే

ఉప్పల్, మే 25: నిరంతరం గస్తీలతో మీ రక్షణకు మేమున్నాం.. శాంతిభద్రతల పరిరక్షణ మా పోలీసుల బాధ్యతని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. దొంగలు వస్తున్నారు..పిల్లలను ఎత్తికెళ్లి చంపేస్తున్నారని వాట్సాప్‌లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఇలాంటి వదంతులు నమ్మొద్దని, ఎలాంటి భయం లేదని అవగాహన సదస్సుల ద్వారా అభయమిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బోడుప్పల్ మారుతీనగర్‌లో కాలనీల ప్రజలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అనుమానంతో అమాయకులపై దాడులు చేయడం తగదని హితవుపలికారు. బస్తీలలో అపరిచితులు సంచరిస్తుంటే పోలీసులకు డయల్ 100 లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తప్పు చేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ, ఏసీపీ గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్‌ఐలు రఘురామ్, అంజయ్య, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అంతకుముందు రోజు దేవేందర్‌నగర్‌లో డీసీపీ ఉమా మహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్, ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి ప్రజలతో సమావేశమయ్యారు. దొంగలు కాలనీలలో సంచరిస్తున్నారని వాట్సాప్ ద్వారా ప్రచారం అవుతున్న భయంకర హత్యల చిత్రాల వదంతులు నమ్మొద్దని అవగాహన కల్పించారు.