రంగారెడ్డి

పోలీస్ సర్కిల్ భవనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, మే 25: జిల్లాలో ఏడు కోట్ల రూపాయలతో పోలీస్‌స్టేషన్‌లను, మూడు కోట్ల రూపాయలతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని హోంమత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన పోలీస్ సర్కిల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మహిళా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో నేరాలను అదుపు చేయుటకు సీసీ కెమెరాలు, వాహనాలు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో నేరాల సంఖ్య తగ్గుతుందని, ఇప్పటికి రాష్ట్రంలో 40 వేలు ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రక్షణకు నిరంతరం శ్రమిస్తున్నదని, రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు 12 వేల కోట్లతో రైతు బంధు పథకం కింద పెట్టుబడులు అందిస్తున్నామని చెప్పారు. పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా 4వ జోన్‌లోకి వెళ్లడంతో జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం పరిగిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఈ విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. జిల్లా రైతు సమన్వయ సంఘం కన్వీనర్, కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్, ఇన్‌చార్జి ఐజి శివశంకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి, జిల్లా ఎస్పీ అన్నపూర్ణ, పరిగి డిస్పీ శ్రీనివాస్ ఎస్‌ఐలు కృష్ణ, హరిప్రసాద్, చంద్రకాంత్, ఆంజనేయులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లోకి మార్చాలి
వికారాబాద్, మే 25: వికారాబాద్ జిల్లాను జోగులాంబ(జోన్-7) నుంచి చార్మినార్(జోన్-6)లోకి మార్చాలని వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధులు కోరారు. శుక్రవారం పరిగికి వచ్చిన హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి అందజేసిన వినతిపత్రంలో వికారాబాద్ ప్రాంతం గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండటం కారణంగా దగ్గర సంబంధం కలిగి ఉండేదని, ఈప్రాంత వాసులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని విద్య, వైద్యం, వ్యాపార అవసరాలను పొందుతూ వస్తున్నారని చెప్పారు. వికారాబాద్ ప్రాంతానికి మహబూబ్‌నగర్ జిల్లాతో అంతగా సంబంధాలు లేవని, ఏ రకంగా చూసినా, విద్య, వైద్య, వ్యాపార, రవాణ మొదలగు అంశాలలోనూ మహబూబ్‌నగర్ ప్రాంతంతో అంతగా సంబంధాలు లేవని, కర్నూల్ సరిహద్దు వరకు అంటే దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు ఆ జిల్లా పరిధి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు వికారాబాద్ జిల్లాను జోన్ ఏడు నుంచి జోన్ ఆరులోకి మార్చాలని లేనిఎడల జిల్లాలోని నిరుద్యోగులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించి, ముఖ్యమంత్రికి విన్నవించి జిల్లా ప్రజలకు తగిన న్యాయం చేయాలని కోరారు. చార్మినార్ జోన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాను వదిలేసి 130 కిలోమీటర్లున్న సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం, 180 కిలోమీటర్లున్న కంగ్డి, 125 కిలోమీటర్లున్న మొగుడంపల్లి కలడపడం విచిత్రకరమని అన్నారు. చార్మినార్ జోన్‌కు తాండూర్ 100, పరిగి 60, వికారాబాద్ 50 కిలోమీటర్లని పేర్కొన్నారు. వినతిపత్రాన్ని రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డికి సైతం అందజేశారు. మంత్రులను కలిసిన వారిలో వీడీడీఎఫ్ ప్రతినిధులు కే.శ్రీనివాస్, ఎన్.శుభప్రద్ పటేల్, యూ.విఠల్(టీయూటీఎఫ్), కొత్తగడి అంజిరెడ్డి (తపస్), రామారావు జోషి, ఎస్.నాగభూషణం, ఎన్.దేవదాసు (పీఆర్‌టీయూటీఎస్), సీహెచ్ వెంకటరత్నం (టీఎస్‌యూటీఎఫ్), నందకుమార్ (టీపీఆర్‌ఎంఈఏ), మారుతి, మాణిక్ రెడ్డి, టీ.శంకర్ (టీఎంజేఏసీ) ఉన్నారు.