రంగారెడ్డి

రైతుల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, కేశంపేట్ 26: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్‌షాక్‌లను నివారించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని 24గంటల కరెంట్‌తోపాటు, రైతుకు పంట పెట్టుబడి సాయం చేస్తు దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలుస్తున్నాడని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట్ మండలంలో శనివారం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి హోమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జేడ్పీ చైర్‌పర్సన్ బండారు భాస్కర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జైశంకర్ విగ్రహా ఆవిష్కరణ, కేశంపేట్ నుంచి రామకృష్ణపురానికి వెల్లె బీటీ రోడ్డు, బ్రీడ్జీ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అనతరం మంత్రి పట్నం మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టో లేని ఎన్నో పథకాలను ప్రజలకు అంధించిన ఘనత కేసీఆర్‌దేననిపేర్కోన్నారు.
మమబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసే అభివృద్దిని చూసి ఇపుడు ఆంధ్రప్రజలే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకు ఉండి ఉంటే బాగుండేదని, దేశంలో 29రాష్ట్రాలో అధికార పార్టీలు చేయలేని ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రవేశ పెడుతున్నాడని అన్నారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకు బీమా, వ్యవసాయానికి 24 గంటలు కరెంటుతో పాటు, నీరు, పంట పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, రూ. 5లక్షల ఇన్సురెన్స్ చేస్తే రైతుకు ఇంకెమి కావాలని వారు కొరారు. కేశంపేట్ మాజీ ఎంపీపీ విశ్వనాధం, సంతాపూర్ మాజీ సర్పంచ్ రాములు బోదినంపల్లి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, కేశంపేట్ ఉప సర్పంచ్ బాలరాజుతో పాటు 500 కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమృతమ్మ, ఎంపీపీ లక్ష్మమ్మ, జేడ్పీటీసీ నర్సింగ్ రావ్, రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.