రంగారెడ్డి

చికెన్‌గున్యాతో వణికిపోతున్న అత్వెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 19: మేడ్చల్ పురపాలక సంఘం పరిధి అత్వెల్లిలో కొన్ని రోజులుగా చికెన్‌గున్యా పడగ విప్పడంతో గజగజ వణికిపోతున్నది. పదుల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు.. చికెన్‌గున్యాకి గురై రోజుల తరబడి చికిత్సపొందతున్నారే తప్ప సక్రమంగా కోలుకోవడం లేదని వ్యాధిగ్రస్తుల తరఫు బంధువులు వాపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సువారికి చికెన్‌గున్యా వ్యాధి సోకుతుండటంతో కాలనీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇమ్రాన్(26), అసరా(32), రహీమున్నీసా (60), మజహర్ హుస్సేన్(30), అక్రం అలీ(31), జకీయా బేగం(45), అరీఫా(46), సలేహా సుల్తానా(34), ఫర్హానా బేగం(27), నజ్మా బేగం(48) చికెన్‌గున్యా బారినపడి చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో చికెన్‌గున్యా తదితర విషజ్వరాలు ప్రబలుతున్నాయని సంబంధిత పురపాలక, వైద్యశాఖ అధికారులకు విషయం తెలిసినా చోద్యం చూస్తున్నారని, నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధితులు ఆరోపించారు. అత్వెల్లిలోని ఓ కాలనీకి చెందిన ప్రతీ ఇంటిలో ఇద్దరు ముగ్గురు చికెన్‌గున్యా బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చికెన్‌గున్యాతో పాటు ఇతర విషజ్వరాలు కూడా విజృంభిస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పారిశుద్ధ్య విషయమై తమ గోడు వెల్లబోసుకున్నా వినే నాథుడే కరువయ్యాడని కాలనీవాసులు వాపోయారు. చికెన్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలిన కాలనీలో మురుగుకాలువలు శుభ్రం చేయకపోడం, పరిశుభ్రతను పాటించకపోవడంతో పాటు పశువుల కొట్టాలతో ప్రధానంగా సమస్య నెలకొందని అన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రం ద్వారా పొగ విడిచిన దాఖలాలు కూడా లేవని.. దీనికి తోడు పందుల బెడద విపరీతంగా ఉందని వివరించారు. పరిస్థితి చేయిదాటి పోకముందే అధికారులు మేల్కొని విజృంభిస్తున్న వ్యాధుల పట్ల అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని అత్వెల్లి వాసులు కోరుతున్నారు.

గుట్కా, ఇసుక అక్రమ రవాణపై ప్రత్యేక నిఘా
వికారాబాద్, జూన్ 19: జిల్లాలో గుట్కా, అక్రమ ఇసుక రవాణపై ప్రత్యేక నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్, సబ్ డివిజనల్ వారీగా ఖచ్చితంగా పీడీ చట్టం నమోదు చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ టీ.అన్నపూర్ణ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను గురించి పీటీ, నాన్ బెయిలెబుల్ వారెంట్, కంపౌండింగ్ కేసులను అడిగి తెలుసుకున్నారు. లాంగ్ పెండింగ్ కేసుల్లో ఏమైనా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉంటే ఏడీజేకు తెలియజేయాలని, భూ తగాతాలకు సంబంధించిన కేసుల్లో 323, 324 తప్ప మిగతా సివిల్ నేజర్ ఉంటే ఆర్డీవోకు తెలియజేసి తదుపరి విచారణను చేయాలని, మిస్సింగ్ కేసుల్లో ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే అట్టి కేసులను మూసి వేయాలని స్పష్టం చేశారు. నమోదైన ప్రతి కేసులో నేరం రుజువయ్యే విధంగా దర్యాప్తు అధికారి దర్యాప్తు చేయాలని, కోర్టు కానిస్టేబుల్‌తో ఎప్పటికపుడు కేసుల వివరాలను తెలుసుకోవాలని, కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడే విధంగా చూడాలని, పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలెబుల్ వారెంట్ చేసులను మూసి వేయాలని, 2012 కంటే ముందు ఉన్న పీటీ/యూఐ కేసులపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించి కేసులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, ఇప్పటి వరకు పీఎస్ వారీగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను తెలుసుకుని, ఏర్పాటు చేయనివారు రెండు లేక మూడు రోజుల్లో ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. నమోదైన కేస్లు పోక్సో కేసులు ఉంటే బాధితులను భరోసా సెంటర్‌కు పంపించాలని, ప్రతి కేసులో క్లైమ్ మ్యాపింగ్‌లో ల్యాండ్ మార్క్స్ నమోదు చేయాలని అన్నారు. పోలీసు కళా బృందాలచే నిర్వహించబడుతున్న వివిధ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ టెక్నాలజీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని, అందులో నేను సైతం, సీసీ కెమెరాలు, టీఎస్ కాప్, కార్డన్ అండ్ సెర్చ్, కాప్ కనెక్ట్, పోలీసు పరంగా నిర్వహిస్తున్న జాబ్‌మేళా గురించి ప్రజలకు తెలియజేయాలని, మసీదు, దేవాలయాలు, చర్చిలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవాలని, నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వాటి ఉపయోగాలను తెలియపర్చాలని వివరించారు. విధుల్లో భాగంగా ఈ-పిట్టీ కేసులను నమోదు చేయడంలో జిల్లా పోలీసుల పనితీరు బాగుందని తర్ఫీదునిచ్చారు. మంచిగా పనిచేసిన పోలీసు అధికారులకు రివార్డులను అందజేశారు. ఐడీ పార్టీ ఇతర విధులను నిర్వహించరాదని, నిర్వహించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వికారాబాద్ డీఎస్పీ శిరీష ఎవిడెన్స్ బేస్‌డ్ పోలీసులో ఉన్న అంశాల గురించి వివరించారు. చైల్డ్‌లైన్ జిల్లా సమన్వయకర్త వెంకటేశ్ మాట్లాడుతూ పీఎస్‌ల వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు, బాల్య వివాహాలు, బడి మానేసిన పిల్లల వివరాలను తెలిపారు. చైల్డ్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు ఛేదించిన కేసులను గురించి, ఆపిన బాల్య వివాహాలు, బడిలో చేర్పించిన బడి మానేసిన పిల్లల, మిస్సింగ్ కేసుల్లో ఎక్కువగా పారిపోయారని వివరించారు. ఇల్లీగల్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, కొత్తగా జిల్లాలో కలిసిన మండలాల నుండి సైతం బాల్య వివాహాల కేసులు వస్తున్నాయని, 50 మిస్సింగ్ కేసుల్లో 44 ఛేదించామని వివరించారు. పోలిస్ స్టేషన్‌లలో నమోదైన మిస్సింగ్ కేసులను తెలిపితే ఛేదించేందుకు అవకాశముందని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు, తాండూర్, పరిగి డీఎస్పీలు రామచంద్రుడు, శ్రీనివాస్, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.