రంగారెడ్డి

జయశంకర్ పోరాట స్ఫూర్తి మరువలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన పోరాటాల స్పూర్తి మరువలేనిదని షాద్‌నగర్ శాసన సభ్యులు ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. కే.నరేందర్, అందె బాబయ్య, ఎంఎస్ నటరాజ్, రాజా వరప్రసాద్, ఆకుల మల్లేష్, లక్ష్మీనర్సింహ్మా రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, మనె్న నారాయణ, రవియాదవ్, బీష్వ రామకృష్ణ, టీఆర్‌ఎస్‌వి నేత జాంగారి రవి పాల్గొన్నారు.గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. జాంగారి నర్సింలు, శ్రీనివాస్, రాంచంద్రయ్య, జూపల్లి శంకర్, ఆర్ల యాదయ్య, అల్లాడ శేఖర్, జానకి రాములు, మునీశ్వర్, శేఖర్ పాల్గొన్నారు.
కొందుర్గు: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకులు జహంగీర్, బాబురావు, చెన్నయ్య, పాండు పాల్గొన్నారు.
ఫోర్జరీ సంతకాలతో నకిలీ అనుమతులు
ఘట్‌కేసర్, జూన్ 21: కార్యదర్శుల ఫోర్జరీ సంతకాలతో గృహ అనుమతులు ఇచ్చిన చౌదరిగూడ ఉప సర్పంచ్ బైరు లక్ష్మణ్ గౌడ్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పీ.రఘువీర్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చౌదరిగూడ పంచాయతీ పరిధిలో ఇటీవల అక్రమ నిర్మాణాలు జరగటంతో ఇన్‌చార్జి కార్యదర్శిగా పని చేస్తున్న భాస్కర్ రెడ్డి నిలిపే యత్నం చేశారు. గృహనిర్మాణాలు చేస్తున్న యజమానులు, బిల్డర్లు తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పారు. అనుమతి పత్రాలను పరిశీలించగా సరైన ఆధారాలు కనిపించలేదు. ఫోర్జరీతో నకిలీ అనుమతులు ఉన్నాయని వారం రోజుల క్రితం పోలీసులకు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణలో గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శి ఏ.రాజ్యలక్ష్మి జారీ చేసినట్లు అనుమతులు ఉండటంతో ఆమెను విచారించారు. సంతకాన్ని ఫోర్జరీ చేసి 10 గృహ నిర్మాణ అనుమతులు పొందారని నిర్దారించారు. నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ బైరు లక్ష్మణ్ గౌడ్, అతనికి సహకరించిన అదే గ్రామానికి చెందిన టీ.నర్సింహాని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంత మంది నిందితులు ఉన్నారని, త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. చౌదరిగూడ పంచాయతీ పరిధిలో అనుమతులు తీసుకున్న మరికొంత మంది భయందోళనలకు గురవుతున్నారు. తీసుకున్న అనుమతులు నకిలీవా, అసలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అధికారులు, పోలీసులు పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.