రంగారెడ్డి

కాంగ్రెస్ పార్టీని వీడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం,జూన్ 23: కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎట్టి పరిస్థిలలో పార్టీ మారనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. కొంత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీని వదిలి వెళ్లిన కారణంగా తనపై కూడా ప్రచారం జరుగుతుందని, అటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. కార్యకర్తలు అయోమయానికి లోను కావద్దని ఎట్టి పరిస్థిలలో కాంస్ పార్టీని వీడేది లేదని సుధీర్‌రెడ్డి చెప్పారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ప్రకటించారు.
సంగీత నృత్య కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వనం
వికారాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు, పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ సర్ట్ఫికెట్, డిప్లొమా కోర్సులకుగాను(వీణ, హిందుస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, కథక్ నృత్యం, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ఫ్లూట్) అడ్మిషన్లను కోరుతున్నట్లు సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. శాస్ర్తియ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందులో చేరడానికి కనీస వయస్సు పది సంవత్సరాలు ఉండాలని, పూర్తి వివరాల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లను సంప్రదించాలని సూచించారు. కళాశాలలు/పాఠశాలల వివరాలలోకి వెళితే హైదరాబాద్ నగరంలోని శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల రామ్ కోఠి ఫోన్ నెంబరుః040-24758090, కోర్సుల వివరాలు.. వీణ, హిదుస్థాని వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, కథక్, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ఫ్లూట్ అని చెప్పారు. సికిందరాబాద్‌లోని శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఫోన్ నెంబరు 040-27801788 అని, ఓల్డ్‌సిటి గుడిమల్కాపూర్ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఫోన్ నెంబర్ 040-23523850, వరంగల్‌లోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఫోన్ నెంబర్ 0870-2426228, నిజామాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల ఫోన్ నెంబర్ 0846-2240389, కరీంనగర్ జిల్లా మంథని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఫోన్ నెంబర్ 08729-259090 నెంబర్లను సంప్రదించాలని వివరించారు. సర్ట్ఫికెట్ కోర్సు రుసుము రూ.500, డిప్మొమా కోర్సుకు రూ.800, దరఖాస్తు ఫారం రూ.25, ప్రవేశ రుసుం రూ.500, దరఖాస్తుకు చివరి తేది జూలై 30, 20 రూపాయల అపరాధ రుసుముతో ఆగస్టు 10, 50 రూపాయల అపరాధ రుసుముతో చివరి తేది ఆగస్టు 31అని వివరించారు.