రంగారెడ్డి

పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 23: పేదింటి ఆడపడుచులకు వరంగా సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. గండి మైసమ్మలోని కుత్బుల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను 14మంది లబ్ధిదారులకు ఎమ్మెల్సీ రాజుతో కలిసి వివేక్ అందజేశారు. వివేక్, రాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు కల్యా ణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఓ వరంలా పనిచేస్తుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభు త్వం సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని చెప్పారు. పేదింటి కుటుంబంలో ఆడపడుచుల పెళ్లి కోసం ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ. 1,00,116లను అందజేసి అండగా నిలబడుతున్నారని తెలిపారు. ఏ ప్రభు త్వం చేయని విధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కవిత, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చింతల్, ఐడీపీఎల్ కాలనీలో వైల్‌ఫూల్ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్, నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డి వేర్వేరుగా పాల్గొని ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం దోహదపడుతుందని చెప్పారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సంజీవ్‌సింగ్, వెంకట్ మాలిక్, విజయ్ కిషన్, రాజేశ్, విజయ్, కవిత పాల్గొన్నారు.