రంగారెడ్డి

‘కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జూన్ 23: కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మె స్థితిలో లేరని, ఎన్ని మాయమాటలు చెప్పినా రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని జాకారం, మక్కపహాడ్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమి అధ్యక్షులతోపాటు కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిల పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రావాళ్లకు వత్తాసు పలికి ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రశేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కోనేరు నర్సింగ్‌రావు, వైస్ ఎంపీపీ చంద్రబాబు గౌడ్, నేతలు రాజు, జిల్లెల వెంకట్‌రెడ్డి, రాజేష్ పటేల్, తాండ్ర వెంకట్ రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, కొండి యాదయ్య, జిల్లెడు బాబురావు, వనంపల్లి రవి, హాఫీజ్, సంజీవరెడ్డి, జబ్బార్, ముస్త్ఫా, పాండు, రాంచంద్రయ్య, శేఖర్, సర్పంచు హన్మంత్‌రెడ్డి, శంకరప్ప, గోపాల్ పాల్గొన్నారు.