రంగారెడ్డి

పంచాయతీ రిజర్వేషన్లపై ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జూన్ 24: గ్రామ పంచాయతీల ఎన్నికల రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయా అంటూ నేతలు ఎదురుచూస్తున్నారు. జూన్ 25వ తేది ఎప్పుడు వస్తుంది.. ఎన్నికల కమిషన్.. రిజర్వేషన్లు ఎప్పుడు విడుదల చేస్తుందని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు జోరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల రాజకీయ నేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. సమర్థులైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపేందుకు నేతలు అనే్వషన కొనసాగిస్తున్నారు. తమకే అవకాశం వస్తుందంటూ ఆశావహులు డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక శాసన సభ్యులకు సవాలుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామ సర్పంచులే కీలకం కానున్న నేపథ్యంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సర్పంచులను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రధాన పార్టీలకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మండల, గ్రామాల ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రధాన పార్టీల నేతలు సిద్ధం చేస్తున్నారు. జూన్ 25వ తేది తరువాత ఏ సమయంలోనైనా రాజకీయ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంతో నేతలు ముందుగానే అభ్యర్థుల ఎంపిక, అందుకు అవసరమయ్యే సామగ్రిని ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు కార్యకర్తలతో ప్రతిరోజు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ గెలుపోటములు, సమర్థుల ఎంపికపై సమాలోచనల్లో మునిగిపోయారని చెప్పవచ్చు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో మొత్తం 153గ్రామ పంచాయతీల్లో నేతలు ముమ్మరంగా తమదైన శైలీలో ప్రచార పర్వాలను కొనసాగిస్తున్నారు. ఆరు మండలాల్లో పురుషులు 73481, స్ర్తిలు 70288, ఇతరులు 13 చొప్పున ఓటర్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి.
ప్రధాన పార్టీలకు సవాల్‌గా పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీల వారీగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏ గ్రామ పంచాయతీలో అధికారం దక్కించుకుంటాము.. ఏ పంచాయతీలో మెజారిటీ రాదనే విషయాలపై నేతలు ముమ్మరంగా చర్చలు కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రతిరోజు గ్రామాల్లో పర్యటనలు చేయడమే కాకుండా కమిటీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించు కోవాలంటూ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేస్తున్నారు. రిజర్వేషన్లలో భాగంగా జనరల్ కేటగిరీ వచ్చే గ్రామాల్లో బహుముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఏ కేటగిరీకి రిజర్వేషన్ వచ్చింది. ప్రస్తుతం ఏ కేటగిరీకి రిజర్వేషన్ వస్తుందోనని నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామాల వారీగా నేతలు ఓటర్ల జాబితాలను చేతుల్లో పట్టుకొని తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనాలు వేసుకుంటూ కార్యకర్తలతో చర్చిస్తున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు ఆరు శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింప జేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంతో ఇప్పటి వరకు ఉన్న రొటేషన్ పద్ధతికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల కోసం నేతలకు ఎదురు చూపులు తప్పడం లేదు.

లక్ష్యసాధనకు అలుపెరుగని పోరాటం
మేడ్చల్, జూన్ 24: విద్యార్థులు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేయాలని.. అప్పటిదాకా శ్రమించాలని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి సూచించారు. మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోగల సీఎంఆర్ ఆడిటోరియంలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. సీఎంఆర్ (ఐటీ) సీఎంఆర్ (సెట్), సీఎంఆర్(ఈసీ), సీఎంఆర్ (్ఫర్మసీ) కాలేజీలలో నాలుగో సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ రంగలోనైనా కష్టపడితేనే ఫలితం ఆశాజనకంగా ఉంటుదన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా అడుగలు వేసి నిరంతరం శ్రమించాలని కోరారు. ఉన్నత రంగాల్లో స్థిరపడేంత వరకు పట్టుదలతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికేవిధంగా పాటుపడాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాలని కోరారు. సమాజానికి ఉపయోగపడే నూతన ప్రయోగాల వైపు దృష్టిసారించాలని కోరారు. దేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని జేఎన్‌టీయూ ఆచార్యులు ఏ. గోవర్ధన్ అన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ కళాశాలల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, డైరెక్టర్‌లు శ్రీశైలం రెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. జంగారెడ్డి, సత్యనారాయణ, రామలింగా రెడ్డి పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఉప్పొంగిన ఆనందంతో తమ మిత్రులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపారు.