రంగారెడ్డి

పాలకవర్గం అశ్రద్ధ.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 24: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి కుంటు పడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. మున్సిపల్ పరిధిలోని 31వార్డులలో దాదాపు అన్ని వార్డులలో అభివృద్ధి పనులు అటకెక్కాయి. మున్సిపల్ పాలకవర్గం అశ్రద్ధ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పట్టణంలో ప్రభుత్వ నిధులు మంజురు అయన కోట్లాది రూపాయల పనులు ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారాయని పలువురు విపక్ష నేతలు, ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్ వాపోతున్నారు. గత ఏడాది నవంబర్ మాసంలో టెండర్లు పూర్తి చేసుకున్న 14వ ప్రణాళిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులు నేటికి పెండింగ్‌లో ఉండటం అందుకు ఉదాహరణగా పలువురు విపక్షాల కౌన్సిలర్‌లు పేర్కొంటున్నారు. వార్డులలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు వంటి అభివృద్ధి పనులు కోట్ల రూపాయలు విలువైన పనులు వాయిదా పడుతున్నప్పటికీ పాలక వర్గం సభ్యుల అవగాహనారాహిత్యంతో ఆయా పనులు ముందుకు సాగటం లేదన్న విమర్శలు పట్టణ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం ఆయా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయడానికి ఇసుక లేమి ప్రధాన కారణంగా కుంటి సాకులు చెబుతూ వచ్చారు. రెండు నెలల క్రితం రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల వాయిదా పట్ల మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న దాదాపు రెండున్నర కోట్ల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించి ఆయా పనులు వెంటనే నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన డబ్బులు ఇంత వరకు తమ చేతికి అంద లేదంటూ, పెండింగ్‌లో ఉన్న పనులు ఎలా చేపట్టాలని పలువురు కాంట్రాక్టర్లు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పట్టణంలోని 31వార్డులలో ఏ ఒక్క వార్డులోను గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు 30శాతం కూడా పూర్తికాక పోవటం శోఛనీయంగా మారుతుంది. 19వ వార్డులో 17 పనులకు 59.85లక్షల రూపాయలు కేటాయించగా ఇంత వరకు అందులో కేవలం నాలుగైదు పనులు మాత్రమే పూర్తి అయినట్లు సమాచారం, వార్డు నెంబర్ 20లో రూ.12లక్షలు విలువైన ఐదు పనులు పూర్తి కాలేదు .21వ వార్డులో రూ.8.40లక్షల విలువైన ఐదు పనులు పూర్తికాలేదు. 22వ వార్డులో ఏడు పనులకు రూ.22లక్షలు కేటాయించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ ప్రాతి నిధ్యం వహిస్తున్న 28వ వార్డులో సైతం లక్షలాది రూపాయల అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర నిధులు, 14ఫైనాన్స్ నిధులకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు మాత్రం తమకు గతంలో చేపట్టిన పనులకు చెందిన చెక్కులు ఇంత వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెల్లించటం లేదన్న వాదనలు పునరావృత్తం చేస్తున్నారు.

చీర కట్టు భారతీయ సంప్రదాయం
* వర్ధమాన నటి హిమజా రెడ్డి
గచ్చిబౌలి, జూన్ 24: చీర కట్టు భారతీయ మహిళ సంప్రదాయమని, మగువల అందాన్ని మరింత దిగ్విణీకృతం చేస్తుందని వర్ధమాన సినీ నటి హిమజా రెడ్డి అన్నారు. మాదాపూర్ శిల్పాకళా వేదికలో చేనేత కళాకారులు, మాస్టర్ డిజైనర్ల సమూహారం క్రాప్ట్ అండ్ వీవర్ అర్టిసన్ వేల్ఫర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ‘కాటన్ అండ్ సిల్క్ వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన చేనేత కళారులు రూపొందించిన వస్త్రాలు మగువల మనసు దోస్తున్నాయి. వివిధ రకాల చీరలు డ్రెస్ మెటిరియల్స్, ఫ్యాషస్ దుస్తులు, వన్ గ్రామ్ గోల్డ్ జూవెలరీ ఆకర్షణీయమైన డీజైన్లలో పలు కళారూపాలు కొలువు దీరాయి. నిర్వహకులు అక్బర్ అలీ, కే.రామరావు దేశవ్యాప్తంగా పేరుగాంచిన చేనేత కళాకారులు, మాస్టర్ డిజైనర్లు 80మందికి పైగా తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారని తెలిపారు. వేసవి కాలానికి అనువైన సమ్మర్ కలెక్షన్లు, వివాహాది శుభ కార్యలలో ధరించే వివిధ రకాల వస్త్రాలైన ఉప్పాడ, కలంకారీ, మంగళ గిరి, వెంకటగిరి, పోచంపల్లి చీరలు, చందేరి సిల్క్, రాజస్తాన్ కటన్ చీరలు, కాశ్మీర్ సిల్క్, హ్యండ్ బ్లాక్ ప్రింట్ చీరలు, బనారస్, జైపూర్ బెడ్ షీట్లు, గాజులు, స్టొన్, వన్ గ్రామ్ జూలరీలు, కొండపల్లి బోమ్మలు ప్రదర్శనలో కొలువుదీరాయి.