రంగారెడ్డి

రైతుల రుణ మొత్తం పెంపుదలకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 27: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు గతంలో ఇస్తున్న రుణం కంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు 200 కోట్ల నాబార్డు రుణం కోసం కృషి చేస్తామని డిసిసిబి చైర్మన్ పెంటారెడ్డి వెల్లడించారు. ఆదివారం పట్టణంలో నూతనంగా నిర్మించిన సహకార భవనంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ (రంగారెడ్డి) జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈసంవత్సరం వర్షాలు సరిగా కురియనందున కరవు విలయతాండవం చేస్తోందని రైతులను ఆదుకునేందుకు ఇచ్చే రుణాన్ని పెంచాలని కోరారు. 2016-17 సంవత్సరాలకు గాను రూ.48.13 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.
సభ్యత్వం పొందిన రైతులు మృతిచెందితే సహకార సంఘం, రైతు వాటా, జిల్లా బ్యాంకు నుండి మూడు వేల రూపాయల చొప్పున తొమ్మిది వేల రూపాయలు అందించాలని సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టగా, చైర్మన్ పెంటారెడ్డి రాష్టస్థ్రాయి సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. రైతులకు సహకారం సంస్థ నుండి 12 శాతానికి రుణం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆరుశాతం రిబేటు ఇస్తోందని, ప్రస్తుతం రావాల్సిన రిబేటు రాలేదని, అదివచ్చిన తర్వాత ఏ సహకార సంస్థకు ఎంత అనేది నిర్ణయించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని హంగులతో సహకార భవనాన్ని నిర్మించినందుకు, తొలిసారి సమావేశాన్ని నూతన భవనంలో నిర్మించినందుకు డిసిసిబి డైరక్టర్ ఎన్.కిషన్‌నాయక్‌ను అభినందించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ మాధవరెడ్డి, డిసివో శ్రీనాథచారి, సిఇవో రవి, ఎజిఎంలు, డిసిసిబి డైరక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్ పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే గాంధీ
కెపిహెచ్‌బి కాలనీ, మార్చి 27: బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణలోని మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. విద్యబోధనకు సంబంధించిన 120 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి మొదటి విడతగా 70 పాఠశాలను మంజూరు చేసిందని ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఒక బాలుర రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వివేకానందనగర్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టే సంక్షేమ పథకాలలో శేరిలింగంపల్లికి స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మైనార్టీలకు నాణ్యత గల విద్య అవకాశాలు కల్పించడానికి 5 ఎకరాలలో రూ.20 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్టు తెలియచేశారు.
అత్యాధునిక వసతులతో నిర్మించే ఈ పాఠశాలలో 5వ తరగతి నుండి 12వ తరగతి ఇంటర్టీడియట్ కోర్సులతో పాటు సివిల్ సర్వీసెస్, ఐఐటి, ఎన్‌టిఐ, ఎమ్‌బిబిఎస్, ఎంసెట్, సైంటిస్ట్ లాంటి ఫౌండేషన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తారని చెప్పారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో 75 శాతం మైనార్టీలకు (ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శిలకు), 25 శాతం ఇతర బలహీన వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌సి, ఓసి)లకు అవకాశం కల్పించనున్నారని, మెరిట్ ఆధారంగానే అడ్మిషన్స్ ఉంటాయని తెలియచేశారు. ఆడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు స్థానికులై ఉండాలని, ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, జన్మదిన ధ్రువపత్రం, 2 ఫోటోస్, ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేసి ధరఖాస్తు ఫారాన్ని సంబంధిత అధికారులకు అందచేయాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా చెప్పారు.