రంగారెడ్డి

కబ్జా భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మార్చి 28: తెలంగాణ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని, టిఆర్‌ఎస్ నాయకులు కబ్జాలు చేసిన అసైన్డు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో తహశీల్ధార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా జరిపారు. తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలో కబ్జాలకు గురైన అసైన్డు భూములను స్వాదీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం రుక్వర్ధన్‌రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కాళేరు రామోజి, అనిల్‌రెడ్డి, టిడిపి నాయకులు నానావత్ రూప్‌సింగ్ నాయక్, సురేష్ నాయక్, జవ్యాజి సత్తయ్య, వేణు, కాంగ్రెస్ నాయకులు పల్లే బాబు, బి నాగేష్‌గౌడ్, యంపాల సుధాకర్‌రెడ్డి, గోపు బాలయ్య, బి.నరేందర్, శంకర్‌గౌడ్, పి.సాయిలు, జి.శంకర్, జి.నర్సింహ్మ, ఎన్.శ్రీను, మాటూరి రవి పాల్గొన్నారు.