రంగారెడ్డి

హరితహారంలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. గాజులరామారం డివిజన్ లాల్‌సాహెబ్‌గూడలో 4వ విడత కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి, మండల తహశీల్దార్ భూపాల్, ఆర్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు. గండిమైసమ్మ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాలలో హరితహారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్ పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని దూలపల్లి గ్రామంలో హరితహారం నిర్వహించారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, రాజులు పాల్గొని ఆరు వేల మొక్కలను నాటారు. సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీలు మోహన్ రావు, సుజాత పాల్గొన్నారు. దుందిగల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు విస్తారంగా కురవాలని మహాన్యాస ఏకాదశి రుద్రాబిషేకం, రుద్ర హవన పూర్వక సహస్ర ఘటాబిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యఅతిథిగా ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్ పూజలు చేశారు.