రంగారెడ్డి

జిల్లాలో ఐటీ పరిశ్రమలకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 14: జిల్లాలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేయనున్నట్లు మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి మేడ్చల్ జిల్లా అన్నివిధాలా అనుకూలమైనదని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు, రవాణా సౌకర్యం, రహదారుల అనుసంధానం, నైపుణ్యతగల మానవ వనరుల లభ్యతపై కలెక్టర్ వివరంగా తెలిపారు. జిల్లాలో పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, నీటి వనరులు కలవని వివరించారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. సమావేశానికి హాజరైన ముప్పై మంది ఐటీ ప్రతినిధులు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ సంచాలకులు అమర్‌నాథ్ రెడ్డి, జేసీ డీ.శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల జనరల్ మేనేజర్ రవీందర్, ఆర్డీవో మధుసూధన్, లచ్చిరెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్య పాల్గొన్నారు.