రంగారెడ్డి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఆగస్టు 14: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని డ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నందిగామ మండలం నర్సప్పగూడలోని అక్కమ్మ చెరువులో 1.32లక్షల చేప పిల్లలను వదలిపెట్టారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం చెందాలనే లక్ష్యంతోనే వందశాతం సబ్సిడీపై చేప విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేప పెంపకానికి 72 ప్రాజెక్టులు, 26వేల చెరువులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. జలాశయాల విస్తీర్ణానికి అనుకూలంగా చేప పిల్లలను పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో నర్సప్పగూడ మాజీ సర్పంచ్ కావలి కృష్ణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, టీఆర్‌ఎస్ నేతలు వెంకట్ రెడ్డి, సూర్యప్రకాష్, ఆకుల మల్లేష్, ఎమ్మె సత్యనారాయణ పాల్గొన్నారు.