రంగారెడ్డి

విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 16: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకాన్ని అధికారులు పకడ్భందీగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. గురువారం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటివైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను స్వయంగా శిబిరం వద్ద ఉండి తెలుసుకున్నారు. ఏమెనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. అనే విషయాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ కంటివెలుగు శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడంతోపాటు అద్దాలు, మందులు పంపిణీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు మెరుగైన కంటివైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్‌డీవో ఎం.కృష్ణ, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంఈవో శంకర్‌రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందునాయక్, కమీషనర్ శరత్‌చంద్ర, డాక్టర్ విజయలక్ష్మీ, జే.శ్రీనివాసులు, శ్రీహరి, అమృత, రవి, లోకనాథ్, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఆకస్మికంగా గురువారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది..అందుకు సరిపడ భవనాలు లేవని, దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు అదనపు గదులను మంజూరు చేసేందుకు కృషి చేయాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. విద్యార్థులకు సరిపడ మూత్రశాలలు లేవని, దాంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. పాఠశాలల సమయ వేళలు పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను నేర్పించి ఉత్తీర్ణత శాతం పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్‌డీవో ఎం.కృష్ణ, ఎంఈవో శంకర్‌రాథోడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జనార్ధన్, అధ్యాపకులు ఉన్నారు.