రంగారెడ్డి

అర్చకుల సమస్యలపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఆగస్టు 17 : రాష్ట్ర వ్యాప్తంగా అర్చక ఉద్యోగులు కొంతకాలంగా సమ్మె చేస్తున్నా అధికారులు జిఓ577ను విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి ఆరోపించారు. అర్చకులు, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కర్మన్‌ఘాట్‌లో బహిరంగసభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన భానుమూర్తి, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బేతి రంగారెడ్డి హాజరయ్యారు. భానుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అర్చక ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి ట్రెజరీ ద్వారా వేతనాలు అందించేందుకు జిఓ 577ను విడుదల చేస్తే అధికారులు దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున సమస్యలను ఎలా పరిష్కారం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న 5625మంది అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందించకపోతే ఆందోళన విరమించమని హెచ్చరించారు. బహిరంగ సమావేశానికి హాజరైన దేవాదాయ అడిషనల్ కమీషనర్ శ్రీనిసరావు మాట్లాడుతూ అర్చక, ఉద్యోగుల సమస్యలు ఆగస్టు 31లోపు పరిష్కారం అవుతాయని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అర్చకులు, ఉద్యోగులు సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జగన్‌మోహన్‌శర్మ, అంబాప్రసాద్, సంతోష్‌కుమార్, వెంకటేశ్వరశర్మ, శంకర్‌శర్మ, చంద్రశేఖర్, కృష్ణమూర్తి, రాంబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.