రంగారెడ్డి

రైతు బజార్‌కు జనం తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 17: కూరగాయలు పండించే రైతులకు లాభం జరగాలని, వినియోగదారుడికి సరసమైన ధరలకు కూరగాయలు అందాలని, దళారుల బెడద ఉండకూడదనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేసింది. రైతుబజార్ ప్రారంభమైన మొదట్లో కూరగాయలు అమ్మేందుకు రైతులు, కొనేందుకు వినియోగదారులు రైతుబజార్‌కు రాకపోవడంతో రైతుబజార్ బోసిపోయింది. ఆ విషయం అధికారుల దృష్టికి రావడంతో సుభాష్ నగర్ కాలనీలో రోడ్డు పక్కన కూరగాయలను అమ్ముకునే వారిని రైతుబజార్‌కు తరలించారు. మెల్లిమెల్లిగా రైతుబజార్‌లో కూరగాయలు అమ్ముకునే వారి సంఖ్య, కొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రం కావడంతో రైతుబజార్‌కు జనం తాకిడి పెరిగింది. ప్రస్తుతం రైతులు, వినియోగదారులతో కిక్కిరిసిపోతోంది. ఆదివారం వస్తే రైతుబజార్‌లో అడుగు పెట్టాలంటేనే పెద్ద గగనమవుతోంది. ప్రతి రోజు కూరగాయలు అమ్మేందుకు 150 మంది రైతులు వస్తే ఆదివారం దాదాపు 300లకు పైగా వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో వినియోగదారులు సైతం భారీగానే తరలివస్తున్నారు. దీంతో రైతుబజార్ పరిసరాలు సంతను తలపిస్తోంది. రైతుబజార్‌కు కొద్దిపాటి పార్కింగ్ ఉండటంతో వాహనాలు రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. రైతుబజార్ సిబ్బంది రైతులకు స్థలం కేటాయించి సర్దుతున్నా, స్థలం సరిపోవడంలేదు. అప్పటికీ హోల్‌సేల్ కూరగాయలు అమ్మేవారిని పశువుల సంత నుండి తీసుకున్న స్థలంలోకి పంపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కూర్చోబెడుతున్నా సరిపోవడంలేదు. రైతుబజార్‌కు పక్కన ఉన్న పశువుల సంతను నారాయణపూర్ గ్రామ శివారుకు తరలించే ప్రణాళిక ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు. సంత అక్కడకు తరలిపోతే ఖాళీ స్థలాన్ని రైతుబజార్‌కు ఇస్తే విశాలంగా ఉంటుందని జిల్లా కేంద్రం వాసులు అంటున్నారు. ఇప్పటికే 150 మంది రైతులకు మార్కెట్ కమిటీ నుండి కూరగాయలు అమ్మేందుకు కార్డులు ఇవ్వగా, కార్డులు తీసుకునేందుకు ఇంకా రైతులు వస్తున్నారు. రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన తొమ్మిది దుకాణాల సముదాయం, క్యాంటీన్‌తో మార్కెట్ కమిటీకి ఆదాయం సమకూరుతోంది.