హైదరాబాద్

చంచల్‌గూడ జైలు వద్ద ఉద్వేగ భరిత వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, మార్చి 29: సత్ప్రవర్తన ఖైదీల విడుదలతో చంచల్‌గూడ జైలు ప్రాంగణం భావోద్వేగాలతో నిండిపోయింది. తెలిసితెలియక చేసిన నేరాలకు సంవత్సరాల నుంచి జైలులో ఖైదీలా మగ్గుతూ ఒక్కసారిగా బయటకు వచ్చిన తరువాత ఆత్మీయుల కలయికతో ఆపుకోలేని దుఃఖంతో విడుదలైన ఖైదీలు, వారి బంధువులు ఆనంద భాష్పాలు రాల్చారు.
సత్ప్రవర్తన ఖైదీల విడుదల అంశం సుప్రీంకోర్టు గడపదాటిన తరువాత గణతంత్ర దినోత్సవం రోజున విడుదల జాప్యం ఏర్పడింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ కావటంతో తెలంగాణ జైళ్ల శాఖ సత్ప్రవర్తన ఖైదీలను మార్గదర్శకాలకు అనుగుణంగా విడుదల చేశారు. చంచల్‌గూడ కేంద్ర మహిళా కారాగారం నుండి 24 మంది జీవిత ఖైదీలు సహా 26మంది మహిళా ఖైదీలు, పురుషుల కారాగారం నుంచి ఏడుగురు జీవిత ఖైదీలు సహా తొమ్మిది మంది మంగళవారం విడుదలయ్యారు. విడుదలైన సత్రవర్తన ఖైదీల కోసం ఉదయం నుంచే వారి కుటుంబ సభ్యులు జైలు వద్ద పడిగాపులు కాసారు. విడుదలైన ఖైదీలను బంధువులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.