రంగారెడ్డి

ఆనందం.. అంతలోనే విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభకార్యానికి వెళ్తున్నామన్న వారి ఆనందం..క్షణాల్లోనే ఆవిరైపోయింది. చిన్నాపెద్ద తేడాలేకుండా పలువురు ప్రాణాలు గాలిలో కలిసి
పోయాయి. పరిగి సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన ఘటనతో
రంగారెడ్డి జిల్లా ఉలిక్కిపడింది. పెళ్లి అనే బంధంతో ఒకటి కావల్సిన వధూవరుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వ్యానులో ప్రయాణించేవారి అవగాహన రాహిత్యం కారణంగా అధిక లోడుతోనే ప్రయాణించటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్థారించినా, ఘటనకు అసలు కారణాలను అనే్వషించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతేగాక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బాధితులకు అత్యవసర సహాయాన్నందించాలని అధికారులను ఆదేశించారు.
పెళ్లి బృందం వ్యాన్ బోల్తా: ఏడుగురు మృతి
20 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

పరిగి మార్చి 30: మరి కొన్ని గంటల్లో పెళ్లికి వెళ్లాల్సిన పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురైంది. పరిగి-షాద్‌నగర్ రహదారిపై పెళ్లి బృందం వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా 20మంది గాయపడ్డారు. ప్రమాద స్థలిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు కలచివేశాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం మధ్యా హ్నం పరిగి గ్రామపంచాయతీ శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి కొందూర్ మండలం ఉత్తరాస్ పల్లి గ్రామానికి ఓ డిసిఎం 65 మందితో పెళ్లి బృందం బయలు దేరింది. పరిగి చిన్న వాగు దగ్గరకి రాగానే డిసిఎం అదుపు తప్పింది. రోడ్డుపైనే బోల్తా పడి రెండు పల్టీలు కొట్టగా ప్రమాదం చోటుచేసుకుంది.
ద్యాచారంలో విషాదం
బుధవారం చోటుచేసుకున్న దుర్ఘటనతో నస్కల్-వికారాబాద్ రోడ్డు రక్తసిక్తమైంది. ధ్యాచారం గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఉత్తరాస్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో గాయపడిన వారికి చికిత్స చేయడంలో వైద్యులకు ఇబ్బందికరంగా మారింది.
అదేవిధంగా తీవ్రంగా గాయపడిన మరికొందరిని పరిగిలోని సాధన ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తుండగా, మరికొందరిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం
పెళ్ళి వ్యాను బోల్తాపడిన సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మృతుల అంత్యక్రియలకు గానూ కలెక్టర్ ఆదేశాల మేరకు కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆర్డీఓ చంద్రమోహన్ ఆర్థిక సహాయం అందజేశారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
పరిగి సమీపంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకుంటామని టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హఠాత్పరిణామం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి పి మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంఘటనపై విచారణ జరిపిస్తాం: రమారాజేశ్వరి
పరిగి సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని జిల్లా ఏస్పీ రమారాజేశ్వరి తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సామర్థ్యానికి మించి పెళ్లి బృందం ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. కేసును పరిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

కాటేసిన కరవు.. కబేళాలకు మూగజీవాలు
ధారూర్, శంకర్‌పల్లి, మార్చి 30: కరువు విలయతాండవం చేస్తోంది. పశు సంపద రోజురోజుకు అంతరించిపోతోంది. రైతుల దగ్గర నానాటికి ఎడ్లు కనిపించకుండా పోతున్నాయి. ఉన్న ఎడ్లను సంతలో అమ్ముకొని రైతులు వలసలు వెళుతున్నారు. పశువుల మార్కెట్‌లోకి వచ్చిన పశువులను దళారులు కొనుగోలు చేసి అల్కాబీరు తయారీకి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్‌పల్లి మండలంలో ప్రతి బుధవారం జరిగే పశువుల సంతకు గతంలో కంటే 60శాతం మాత్రమే మార్కెట్‌కు పశువులను తరలిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన పశువులను కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. పశువులకు పశుగ్రాసం కూడా లేకుండా పోవడంతో చేసేది లేక రైతులు తమ పశువులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు పశువులను అడ్డగోలుగా కొనుగోలు చేసి అల్కాబీరు తయారీకి ఉపయోగిస్తున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ధారూర్‌లో ప్రతి శనివారం కూరగాయలు, ధాన్యపు మార్కెట్‌తో పాటు పశువుల సంతను నిర్వహిస్తున్నారు. రెండు వారాలుగా మార్కెట్‌కు అతి తక్కువ పశువులు వస్తున్నాయి. వచ్చిన పశువులను కొనుగోలు చేసే నాథుడు లేకపోవడంతో దళారులు అడిగిన ధరలకే అమ్ముకుంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి మనుషులు తాగేందుకే నీరు దొరకడం లేదు. పశువులకు ఎక్కడినుండి నీరు తేవాలో అర్థంకాక ఉన్న పశువులను అమ్ముకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు.