రంగారెడ్డి

భారత దేశం ప్రపంచానికి విశ్వగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 2: భారత దేశం ప్రపంచానికి విశ్వగురులాంటిదని పూర్వీకులు మనకిచ్చిన వారసత్వాన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆయన విద్యార్థులకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. శనివారం మేడ్చల్ మండలంలోని మైసమ్మగూడ గ్రామ పరిధిలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (అటానమస్)లో రెసోనెంజ్ 2కె16 పేరుతో వార్షికోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు.
పేపర్‌బాయ్‌గా పని చేసిన కలామ్ భారత రాష్టప్రతిగా ఎదిగారని ఛాయ్ అమ్మిన మోదీ నేడు దేశ ప్రధానిగా ఎదిగారని అన్నారు.ఈ దేశ గాలి పీల్చిన వారు, నీళ్లు తాగిన వారు ప్రపంచ మేధావులుగా ప్రసిద్ధిగాంచారని నేడు ప్రపంచంలో ఏక్కడా చూసినా భారతీయులే ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. ఆమెరికాలోని పది మంది డాక్టర్లలలో మన దేశానికి చెందిన వారే సగం మంది కంటే ఎక్కువ ఉంటారని చెప్పారు. అందులో తెలుగు వాళ్లే అధికమని అదే ఈ దేశ గొప్పతనమన్నారు. దేశంలో ఎనలేని టాలెంట్ ఉందని వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఆశించిన విభాగాల్లో మెరుగ్గా రాణించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని రాజకీయాలకు గౌరవం తగ్గుతోందని, దురదృష్టవశాత్తు పార్లమెంటు, అసెంబ్లీలో కూడా గౌరవం తగిపోయిందన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఓ సభ్యురాలు తనను రేప్ చేస్తారా అంటూ ప్రశ్నించడం విడ్డూరమన్నారు. ప్రజలు మంచి వారిని ఎన్నుకోవాలని కోరారు. విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని కోరారు. పాశ్చాత్య ధోరణి వ్యామోహంలో పడిపోకూడదన్నారు. అనంతరం ఆయన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ - లైబ్రరీని ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపి, సిఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ చామకూర మల్లారెడ్డి బిజెపి నాయకులు వెంకయ్యనాయుడిని గజమాలతో ఘనంగా సత్కరించి ఙ్ఞపికను బహుకరించారు.
నాకు ఇద్దరే దేవుళ్లు.. మల్లారెడ్డి
తన జీవితంలో తనకు ఇద్దరే దేవుళ్లని ఒకరు ఎంపిగా జీవితాన్నిచ్చిన చంద్రబాబు అని మరొకరు కోరిన కోరికలు తీర్చే వెంకయ్యస్వామి అని ఎంపి మల్లారెడ్డి పేర్కొన్నారు.
భావోద్వేగంతో ప్రసగించిన ఎంపి తనకు వెంకయ్యనాయుడు వెంకన్నస్వామితో సమానమన్నారు. తన విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన అందించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఉన్నతమైన ఆలోచనలు ఉండాలని కష్టపడే తత్వం ఉంటే విజయాలు వాటంతంట అవే వరిస్తాయన్నారు. పట్టుదల, దృఢసంకల్పం, కసితో విద్యార్థులు అనుకున్న రంగాల్లో రాణించాలని అకాంక్షించారు. కన్నవారి కలలను సాకారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. కార్యక్రమంలో టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రమణ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సాయిగారి మల్లారెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, ఎంపిపి విజయలక్ష్మీ, టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటిసిలు అమరం మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వంశీ, ఫ్యాకల్టీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.