రంగారెడ్డి

కార్పొరేట్ విద్యకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 21: నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. డీఎస్‌సీ వేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను నిర్వీర్యం చేస్తోందని కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరీ సతీష్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వివేకవాణి విద్యాలయంలో ఈనెల 29న నగర శివారు గౌరెల్లిలో నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ ఐక్యకార్యాచరణ సమితి ఆత్మగౌరవ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలతో ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రేవేటు విద్యాసంస్థలు అందిస్తుండగా, ధనిక రాష్టమ్రంటూ 2300 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లను పెండింగ్‌లో పెట్టి ఇవ్వడం లేదని వాపోయారు. టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. పరిష్కరించకపోగా సంస్థలపై నిందలు వేయడం, అవహేళన చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. టీపీజేఎంఏ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకుంటామని మెనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. టీఎర్‌ఎస్‌ఎంఏ కోర్ కమిటీ సభ్యుడు నాగయ్య మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ఎంఏ నాయకులు లూయిస్, శేఖర్, గౌస్ పటేల్, భృంగీ పాఠశాల కరస్పాండెంట్ కుమారస్వామి, డైరక్టర్లు శివప్రసాద్, సురేష్ పాల్గొన్నారు.