రంగారెడ్డి

పరిశ్రమ స్థాపనకు సత్వరమే అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని, హెచ్‌ఎండీఏ పరిధిలో సర్వర్లు పని చేయనందున దరఖాస్తులను మ్యాన్‌వల్‌గా అనుమతులు మంజూరు చేయాలని హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలతో వాహనాలు కొనుగోలు చేసినవారి ఫోన్ నెంబర్లు, జీపీఎస్ వివరాలు అందజేయాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయాలని వివరించారు. ఈనెల 25వ తేదీతో ఓటరు నమోదు ముగుస్తుందని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు కొత్త ఈఆర్వో నెట్‌పై నాలుగు రోజులపాటు అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఈఆర్వోలుగా, ఏఈఆర్వోలుగా నియమిస్తామని పేర్కొన్నారు. డీఆర్వో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అధికారులు విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రజలు, రాజకీయ ప్రజాప్రతినిధులు, మీడియాతో పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించినందుకు రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగాన్ని కలెక్టర్ అభినందించారు. నిమజ్జనం సందర్భంగా రోడ్లపై ఏర్పడిన చెత్తా చెదారాన్ని తొలగించాలని కోరారు. జిల్లాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని డీపీఓ రవికుమార్‌ను ఆదేశించారు. నెల చివరినాటికి హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు ప్రతి గ్రామ పంచాయతీల్లో స్థల సేకరణ చేయాలని అన్నారు.
జిల్లా అధికారులు గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 47 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో మధుకర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయ కుమారి, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్, డీఆడీఓ కౌటిల్య, ఆర్డీఓ లచ్చిరెడ్డి, డీపీఓ రవికుమార్ పాల్గొన్నారు.